CBN New Look : నయా లుక్ లో సీఎం చంద్రబాబు
CBN New Look : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) సాధారణంగా ఒకే తరహా దుస్తుల్లో, అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు
- By Sudheer Published Date - 08:11 PM, Sat - 4 October 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) సాధారణంగా ఒకే తరహా దుస్తుల్లో, అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. పండుగల సమయంలో లేదా ప్రత్యేక వేడుకలలో తప్ప ఆయన వేరే దుస్తుల్లో కనిపించడం అరుదు. అయితే ఇవాళ జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈసారి ఆయన ఆటో డ్రైవర్ స్టైల్‌లో, ఆ తరహా చొక్కా వేసుకొని ఆటో వాలాలు, టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడం, వారికి ప్రోత్సాహం అందించడం. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు సాధారణంగా ఉన్న అధికార దుస్తులను విడిచి ఆటో డ్రైవర్ల లుక్‌లో ప్రత్యక్షమవడం ద్వారా తాను వారితో సమానంగా ఉన్నానని, వారి కష్టాలను అర్థం చేసుకుంటున్నానని సందేశం ఇచ్చారు. ఈ లుక్ కేవలం ఫ్యాషన్ కోసం కాదు, ఆ వర్గానికి దగ్గరయ్యే, వారిని ప్రేరేపించే సింబాలిక్ చర్యగా మారింది.
Harish Rao: కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు
ఆటో డ్రైవర్లతోపాటు పవన్ కల్యాణ్ , నారా లోకేశ్ లు కూడా ఇదే తరహా చొక్కాలు ధరించడం గమనార్హం. ఇది పార్టీ మొత్తం వర్గానికి ఒకే సంకేతం పంపినట్లయింది. అంటే శ్రామిక వర్గానికి మద్దతు, వారి సమస్యల పరిష్కారం పట్ల కట్టుబాటుగా ఉండటాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్స్ కోసం ప్రత్యేక యాప్ ను ప్రవేశ పెట్టారు.
ఉబర్, ర్యాపిడోల పోటీని తట్టుకునేలా ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు కొత్త యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో ఎక్కడ ఉన్నా నేరుగా బుకింగ్స్ డ్రైవర్లకు వెళ్తాయని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్లో ఉండే పనిలేకుండా చేస్తామన్నారు. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, యాప్ నిర్వహణ డ్రైవర్లు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.