HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Speech In The Assembly On The Tirumala Laddu Adulteration Issue

ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.

  • Author : Latha Suma Date : 24-02-2026 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu speech in the assembly on the Tirumala laddu adulteration issue
CM Chandrababu speech in the assembly on the Tirumala laddu adulteration issue

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తిరుమల లడ్డూ వ్యవహారంపై నిర్వహించిన చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు. ‘మహాపాపం’ పేరుతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లడ్డూ కల్తీ తీరును వివరించారు. రాజకీయ వివాదాలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు సూచన మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక పంపిందని, దాని ఆధారంగా ఏకసభ్య కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి … రూ.231 కోట్ల అక్రమాలు

2019 నుంచి 2024 మధ్య కాలంలో 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వినియోగించారని సీఎం తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.231.51 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించారని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచీతో లూటీ జరిగినట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినప్పటికీ సంబంధిత నివేదికను దాచిపెట్టారని ఆరోపించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తాను స్వయంగా చెప్పలేదని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు. “ఆ భగవంతుడే నాతో చెప్పించాడు” అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

నిబంధనల సడలింపు … షెల్ కంపెనీల పాత్రపై ఆరోపణలు

ఈ వ్యవహారం టీటీడీ ఈవో, ఛైర్మన్‌కు తెలియకుండా జరుగుతుందా? అని సీఎం ప్రశ్నించారు. వారి అనుకూలంగా నిబంధనలను సడలించారని విమర్శించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని, నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారని తెలిపారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీని ఎనిమిది టన్నులకు కుదించారని చెప్పారు. డెయిరీల వార్షిక టర్నోవర్ అర్హతను రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గించారని, సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్లకు మినహాయింపులు ఇచ్చారని ఆరోపించారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని పేర్కొన్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్, శ్రీవైష్ణవి డెయిరీ, మాల్ గంగా మిల్క్ డెయిరీ వంటి షెల్ కంపెనీలు సహకరించాయని తెలిపారు. ల్యాబ్ నివేదికల ఫోర్జరీ జరిగిందని, తప్పుడు రిటర్నులతో మోసం చేశారని ఆరోపించారు. కల్తీ నెయ్యి సరఫరాదారులకు కొందరు అధికారులు సహకరించారని అన్నారు. ప్రసాదం తీసుకున్న భక్తులందరూ నాణ్యత తగ్గిందని చెప్పారని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదంపై జరిగిన ఈ వ్యవహారం అత్యంత గంభీరమైందని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh assembly
  • Bole Baba Dairy
  • CM Chandrababu
  • corruption
  • Ghee Adulteration
  • SIT Investigation
  • tirumala
  • ttd
  • Vaishnavi Dairy
  • yv subba reddy

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd