Kuppam : స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేసిన సీఎం చంద్రబాబు
జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం.
- By Latha Suma Published Date - 04:12 PM, Tue - 7 January 25

Kuppam : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా, యాప్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారని సీఎం అన్నారు. ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చాం. కార్యకర్తలు ప్రజాస్వామ్యం లో చాలా కీలకం అన్నారు.
కుప్పంలో జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతాము. జననాయకుడు లో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ ఎంట్రీ చేస్తాం. వారి పరిస్థితి బట్టి ఆర్దిక సహాయం చేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. భూ సమస్యలు అనేది ఐదేళ్ళుగా తీవ్రంగా పెరిగాయి. టెక్నాలజీ ద్వారా ప్రజలు, కార్యకర్తలు సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తాం అని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో జర్నలిస్టు ల పై ఉన్న కేసులన్ని ప్రత్యేక జీవోతో ఎత్తేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర. దేశంలో ఏపార్టీకి ఇలాంటి ఘనత లేదన్నారు. గోదావరి బనకచర్ల అనుసంధానం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కుప్పంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేశాము. కుప్పం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించాం అని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, ఈరోజు జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు… పనితీరును పరిశీలించారు. జన నాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా, త్వరలో రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.