CM Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
పోలవరంలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రాధాన్యతను ఎత్తిచూపారు. 2
- Author : Praveen Aluthuru
Date : 28-06-2024 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుసగా సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఏ క్రమంలో అధికార యంత్రాగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. కాగా ఏడు ప్రభుత్వ శాఖల స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, మొదటిది ఆంధ్రా ప్రజల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించింది.
పోలవరంలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రాధాన్యతను ఎత్తిచూపారు. 20-25 రోజుల్లో అన్ని శ్వేతపత్రాలను విడుదల చేస్తామని, ప్రత్యేక వెబ్‌సైట్‌లో బడ్జెట్ మరియు సంబంధిత పత్రాలను సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు సీజన్లుగా ఆగిపోయాయని సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. నదుల అనుసంధానం కోసం పోలవరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను నొక్కిచెప్పిన ఆయన, గత ప్రభుత్వం తమ తప్పులను పునరావృతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఇకపై వివాదాలు, పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని కోరారు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ సరైన ప్రక్రియ ఒప్పందం లేకుండానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను మార్చారని ఆయన వెల్లడించారు.
Also Read: Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్కడంటే..?