Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్కడంటే..?
- By Gopichand Published Date - 04:45 PM, Fri - 28 June 24
Lightning Strikes: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఊరట లభించింది. రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు (Lightning Strikes) 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాటుకు ఏయే జిల్లాల్లో ప్రజలు చనిపోయారో తెలుసుకుందాం?
గత 24 గంటల్లో యూపీలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడగా.. 20 మంది చనిపోయారు. వారణాసి, పరిసర జిల్లాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. హమీర్‌పూర్‌లో ముగ్గురు, మహోబా, బరేలీలో ఇద్దరు చొప్పున పిడుగులకు బలయ్యారు. బదౌన్, మహారాజ్‌గంజ్, ఝాన్సీలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Sushmita Sen : 48 ఏళ్ళ వయసులో డేట్ ఆఫ్ బర్త్ మార్చిన హీరోయిన్.. ఎందుకని?
యూపీలో 5 రోజుల పాటు భారీ వర్షాలు
యూపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు ఉత్తరప్రదేశ్‌లో 5 రోజుల పాటు విస్తరించనున్నాయి. పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, రోహిల్‌ఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని యోగి ప్రభుత్వం ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.
We’re now on WhatsApp : Click to Join
జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది
పిడుగుపాటుకు గురైన వారి మృతదేహాలను జిల్లా యంత్రాంగం తమ అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంతేకాకుండా పిడుగుపాటుకు అనేక పశువులు కూడా మృతి చెందాయి. దీనిపై అధికార యంత్రాంగం విచారణ జరుపుతోంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తింది.