Chandrababu : ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలిః సీఎం చంద్రబాబు
- By Latha Suma Published Date - 03:21 PM, Tue - 9 July 24

Chandrababu: నేడు ఏపి సచివాలయం(AP Secretariat)లో రాష్ట్రా స్థాయి( State level) బ్యాంకర్ల(Bankers)తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలను బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని ఈ మేరకు ఆయన కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని… రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో ప్రముఖ పాత్ర అని కొనియాడారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు.