MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:54 AM, Thu - 27 February 25

MLC Elections : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు, నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చంద్రబాబు, లోకేశ్ చేరుకుని ఓటు వేశారు.
Read Also: MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు , లోకేష్ . @ncbn @naralokesh #ChandrababuNaidu #NaraLokesh #TDP #MLC #MLCElection2025 #mlcpolls #HashtagU pic.twitter.com/tTVJWqkjMW
— Hashtag U (@HashtaguIn) February 27, 2025
ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది’ అని సీఎం పేర్కొన్నారు. కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ (కూటమి) కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కుఅన్ని ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి తగిన చర్యలు తీసుకుంది. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో 6 లక్షల 62 వేల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 939 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. పోలింగ్ బ్యాలెట్ పేపర్‌పై జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవచ్చు.
Read Also: SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు