HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Every Moment Was Precious To Save Their Lives Harish Rao

SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు

టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.

  • Author : Latha Suma Date : 27-02-2025 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Every moment was precious to save their lives: Harish Rao
Every moment was precious to save their lives: Harish Rao

SLBC Tunnel : మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఘటనపై హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో ఇప్పటికీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.

Read Also: Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన

సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? కార్మికుల ప్రాణాలు ముఖ్యమా? కనీసం సీఎం అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై సూచనలు చేయలేదు అని హరీశ్‌రావు ఆక్షేపించారు. టన్నెల్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇప్పటికి ఐదు రోజులైంది. సొరంగంలో ఉన్నవారు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది. ఎంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభిస్తే అంత తొందరగా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయొచ్చు. ఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరమని ఆయన అన్నారు.

సొరంగం మొత్తం మూసుకుపోవడంతోపాటు 15 మీటర్ల ఎత్తు బురద పేరుకుపోయింది. పైకప్పు ఊడిపడడంతో టీబీఎం మిషన్‌ ముందుభాగం ధ్వంసమై వెనుకభాగం తన్నుకువచ్చింది. పైకప్పు కూలిన ప్రాంతం 200 మీటర్ల వరకు ఉంటుందని తెలిపారు. ఎట్టకేలకు 14వ కిలోమీటర్‌ సమీపంలోకి చేరుకున్నాయి. 13.5 కిలోమీటర్ల వద్ద పూర్తిగా ధ్వంసమైన టీబీఎన్‌ మిషన్‌ కన్వేయర్‌ బెల్టు, ఆక్సిజన్‌ ట్యూబ్‌, శిథిలాలను తొలగించడంతో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. కాగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.

Read Also: Posani Krishna Murali Arrest : రహస్య ప్రదేశంలో విచారణ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assistive measures
  • BRS team
  • Congress Government
  • harish rao
  • SLBC Tunnel

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd