HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Controversy At Polling Station In Guntur

MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం

MLC Elections : గుంటూరులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది

  • Author : Sudheer Date : 27-02-2025 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guntur Mlc Polling
Guntur Mlc Polling

ఆంధ్రప్రదేశ్‌(AP)లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Elections) సందర్భంగా గుంటూరు(Guntur)లో వివాదం చోటుచేసుకుంది. గురువారం తెలుగురాష్ట్రాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌(AP), తెలంగాణ(Telangana)లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Janasena : జనసేన కోసం భారీగా ఖర్చుచేసా..కానీ పవన్ పట్టించుకోలే – జబర్దస్త్ నటుడు

ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్‌ నియోజవర్గాలకు ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అయితే గుంటూరులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పార్టీల మధ్య వివాదం పెరిగిన కారణంగా అధికారులు మధ్యవర్తిత్వం వహించారు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద PDF అభ్యర్థి లక్ష్మణరావు కోసం ఓటేయాలని ఓ టెంట్ ఏర్పాటు చేయడం, పోస్టర్లు అతికించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వారు వెంటనే ఎన్నికల అధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల సహాయంతో టీడీపీ నేతలు తాము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా చూడాలని కోరారు. ఎన్నికల అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన

ఇక ఏపీలో 6 లక్షల 62 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు చోట్ల దాదాపు 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధికారులు 939 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచరర్‌ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ స్థానంలలో అభ్యర్థిని ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యా యులు ఓటు వేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • guntur MLC polling
  • mlc elections
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd