New Airports : ఏపీలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఇవే..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో 1,379 ఎకరాల్లో ఎయిర్ పోర్టును(New Airports) నిర్మించాలని గత టీడీపీ హయాంలోనే నిర్ణయించారు.
- By Pasha Published Date - 11:42 AM, Sat - 4 January 25

New Airports : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. వాటితో ఏపీ టూరిజం రెక్కలు తొడగనుంది. ఇంతకీ ఆ ఎయిర్‌పోర్టులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏర్పాటవుతాయి ? అనేది ఈ కథనంలో చూద్దాం..
Also Read :Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర
- శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే ఇప్పటికే కంప్లీట్ అయింది. అక్కడ రెండు దశల్లో 1,383 ఎకరాల్లో ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నాం.
- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో 1,379 ఎకరాల్లో ఎయిర్ పోర్టును(New Airports) నిర్మించాలని గత టీడీపీ హయాంలోనే నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూసేకరణ జరగాల్సి ఉంది. దగదర్తి సమీపంలోనే బీపీసీఎల్ కంపెనీ చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.
- ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 657 ఎకరాలను టీడీపీ ప్రభుత్వం గుర్తించింది.
- పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించాలని యోచిస్తున్నారు.
- తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించాలని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయం కోసం తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానున్నాయి.
- శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. శ్రీసిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు అయితే భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు తీరుతాయి.
- శ్రీసిటీలో ఏవియేషన్ యూనివర్సిటీ, శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
- కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. తొలి దశలో 683 ఎకరాల్లో, రెండో దశలో 567 ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతుంది. దీనిపై సాధ్యాసాధ్యాల వివరాలతో ఫీజిబిలిటీ నివేదికను అధికారులు రెడీ చేశారు.
- గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించనున్నారు. ఈ విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.