HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away Who Is He

Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర

డాక్టర్ చిదంబరం(Rajagopala Chidambaram) శాస్త్రవేత్తగా తన కెరీర్‌లో భాగంగా.. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు.

  • By Pasha Published Date - 10:46 AM, Sat - 4 January 25
  • daily-hunt
Nuclear Scientist Rajagopala Chidambaram Pokhran Nuclear Tests

Rajagopala Chidambaram: మన దేశం నిర్వహించిన పోఖ్రాన్-1, పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త, క్రిస్టలోగ్రాఫర్ డాక్టర్ రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. గత కొన్ని రోజులుగా రాజగోపాల చిదంబరం ఆరోగ్యం బాగా లేదు. డాక్టర్ చిదంబరం(Rajagopala Chidambaram) శాస్త్రవేత్తగా తన కెరీర్‌లో భాగంగా.. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు.

Also Read :Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది

డాక్టర్ రాజగోపాల చిదంబరం 1994-95 సమయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) గవర్నర్స్ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించాడు.  ఆయన భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా సేవలు అందించారు. భారతదేశం అణ్వాయుధ కార్యక్రమంలో డాక్టర్ చిదంబరం కీలక పాత్ర పోషించారు. 1975 సంవత్సరంలో  పోఖ్రాన్-I అణు పరీక్ష, 1998లో పోఖ్రాన్-II అణు పరీక్ష  జరిగాయి. ఆ అణు పరీక్షల కోసం వివిధ విభాగాలను సమన్వయం చేసే కీలక విధులను డాక్టర్ రాజగోపాల చిదంబరం నిర్వర్తించారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసమే  ఉపయోగించాలని ఆయన వాదించేవారు.  భారతదేశ అణుశక్తి కార్యక్రమాన్ని వేగవంతం చేసిన సైంటిస్టుగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డాక్టర్ చిదంబరం‌ను భారతదేశం 1975లో పద్మశ్రీ పురస్కారంతో, 1999లో  పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించుకుంది.

Also Read :India vs Australia : చెలరేగిన నితీశ్.. 181 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

భారత్‌కు అణ్వస్త్రాలపై రాజగోపాల చిదంబరం ఏమన్నారంటే.. 

ఈ ఏడాది జూన్‌‌లో ప్రముఖ మీడియా సంస్థకు డాక్టర్ రాజగోపాల చిదంబరం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన అణ్వాయుధాల తయారీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1998 సంవత్సరంలో భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన తర్వాత ఇద్దరు అమెరికా రచయితలు సీఈ పాయిన్, ఎంజీ మెక్‌కింజీ ఓ సంచలన వ్యాసాన్ని రాశారు. అందులో ఒక వెన్ డయాగ్రామ్‌ను వాళ్లు పబ్లిష్ చేశారు. అణ్వాయుధాలను తయారు చేసుకున్న ప్రతీ దేశానికి.. అప్పటికే అణ్వాయుధాలను కలిగిన ఏదో ఒక దేశం నుంచి సాయం లభించిందని అందులో చూపించారు.  ఇలా అణ్వాయుధ దేశాలుగా మారిన వాటికి సమాచారం రహస్యంగా చేరవేయబడి ఉండొచ్చని, లేదంటే దాన్ని దొంగిలించి ఉండొచ్చని వ్యాసంలో రచయితలు ప్రస్తావించారు.  అమెరికా, బ్రిటన్ అణ్వాయుధాల తయారీలో రహస్యంగా కలిసి పనిచేశాయని అందులో ఉంది. చైనా, రష్యా దేశాలు.. చైనా, పాకిస్తాన్ దేశాలు.. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు.. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మరో నాలుగు దేశాలు అణ్వాయుధాల తయారీలో ఏదో ఒక రకంగా కలిసి పనిచేశాయని ఆ రచయితలు రాశారు. భారత్‌కు వాటిలో ఏ ఒక్క దేశంతోనూ లింక్ లేదు. మన భారతదేశం ఎవరి నుంచి కూడా అణ్వాయుధాల తయారీ టెక్నాలజీని దొంగిలించలేదు. ఎందుకంటే మనకు సొంతంగా అణ్వస్త్రాల తయారీ సత్తా ఉంది’’ అని డాక్టర్ రాజగోపాల చిదంబరం వివరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhabha Atomic Research Centre
  • Nuclear Scientist
  • Pokhran
  • Pokhran Nuclear Tests
  • Rajagopala Chidambaram

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd