Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీజేపీ(Telangana BJP Chief)లో ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఆయన తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత.
- By Pasha Published Date - 09:41 AM, Sat - 4 January 25

Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరు ? అనేది ఈ నెల (జనవరి) చివర్లోగా తేలిపోనుంది. ఈసారి కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం భారీ పోటీ నెలకొంది. మునుపటి కంటే రాష్ట్రంలో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉన్న ప్రస్తుత తరుణంలో.. పార్టీ పగ్గాలను దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో అర డజను మందికిపైనే నేతలు ఉన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు తెలంగాణ పార్టీ పగ్గాలు.. మరోవైపు కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డికి భారంగా మారాయి. అందుకే రాష్ట్రానికి కొత్త పార్టీ అధ్యక్షుడిని నియమించే దిశగా కసరత్తు జరుగుతోంది.
Also Read :Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ శతకాలు.. ప్రీతి పాప హ్యాపీ
- బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతల్లో మొదటి నుంచీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. ఒకప్పుడు ఆయనకు కేసీఆర్ సన్నిహితుడనే పేరు ఉండేది. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతో వైరుధ్యాలు తలెత్తడంతో, తగిన ప్రయారిటీ లభించకపోవడంతో ఈటల బీజేపీలోకి వచ్చారు.
- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బీజేపీ(Telangana BJP Chief)లో ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఆయన తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత. అయినా బీజేపీలో అనతి కాలంలోనే అర్వింద్‌కు మంచి పేరు వచ్చింది.
- బీజేపీలో చాలా తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్న లీడర్ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు. న్యాయవాదిగా ఈయన ఫేమస్. గతంలో జర్నలిస్టుగానూ పనిచేశారు. మెదక్ ఎంపీగా సంచలన విజయం సాధించడంతో బీజేపీ హైకమాండ్‌ను రఘునందన్ ఆకట్టుకున్నారు.
- మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు.. తెలంగాణ బీజేపీలో అత్యంత సీనియర్ నేత. పార్టీ జాతీయ స్థాయి సీనియర్ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి.
- తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరందరు కూడా సీనియర్ నేతలే. పార్టీలో మంచి పేరు ఉంది.
Also Read :Decisions By Umpires: కొంపముంచుతున్న అంపైర్ల తప్ప్పుడు నిర్ణయాలు
- తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఇప్పటికే షురూ అయింది.
- ఈనెల 6, 7 తేదీల్లో బీజేపీ మండల కమిటీల ఎన్నికలు జరుగుతాయి. తదుపరిగా పార్టీ జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
- మండల కమిటీల ఎన్నిక ప్రక్రియ 50 శాతం పూర్తయితే జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది.
- బీజేపీలో పార్టీపరంగా 38 జిల్లా కమిటీలు ఉన్నాయి. దీనిలో 19 జిల్లా కమిటీల ఎన్నిక పూర్తికాగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది.
- జనవరి నెలాఖరుకల్లా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నిక కోసం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను ఎన్నికల అధికారిగా నియమించారు.
- కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ బీజేపీ నుంచి ఒకరు ఓసీ, మరొకరు బీసీ ఉన్నారు. సామాజిక సమీకరణాలను కూడా ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్‌ను నియమించే అవకాశం ఉంది.