HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chemicals In Srisailam Prasadam Cm Chandrababus Shocking Comments

శ్రీశైలం ప్రసాదంలో రసాయనాలు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 06-02-2026 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srisailam Laddu
Srisailam Laddu

Srisailam Prasadam  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బాత్‌రూమ్‌లో క్లీన్ చేసే కెమికల్స్‌తో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో..చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ అంశం మీద ఏపీలోని అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అధికార కూటమి.. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రోజున సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్లలో జరిగిన మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ విషయాన్ని మరోసారి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. ఈ క్రమంలోనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేశారన్న చంద్రబాబు.. సీబీఐ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సెట్) ఏమీ లేదని చెప్పారంటూ బుకాయిస్తున్నారని అన్నారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు ప్రస్తావించారు. బాత్‌రూములు శుభ్రం చేసే రసాయనాలతో కల్తీ నెయ్యి చేశారంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రసాదంపైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

శ్రీశైలం ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటూ ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించామని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను మార్చామని చంద్రబాబు వెల్లడించారు. తిరుమల లడ్డూకు సంబంధించి గతానికి, ఇప్పటికీ వ్యత్యాసం ఉందని చంద్రబాబు వివరించారు.

మరోవైపు తిరుమల లడ్డూ విషయంపై ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న పరిస్థితులలో.. శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ నెయ్యితో తయారు చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adulterated Ghee
  • AP CM Chandrababu Naidu
  • Former CM YS Jaganmohan Reddy
  • srisailam
  • Srisailam Mallikarjuna Temple
  • Srisailam Prasadam
  • YSR Congress Party

Related News

Adulterated Ghee Supplied T

మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

తిరుమల లడ్డూ వివాదం సద్దుమణగకముందే, శ్రీశైల మల్లన్న ప్రసాదంలోనూ భారీ అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల సెంటిమెంట్లతో ఆటలాడుకున్నారని, కనీసం భక్తి భావం లేకుండా బాత్‌రూమ్ క్లీన్ చేసే కెమికల్స్‌ను

  • YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada

    జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్

  • Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu

    ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

  • Janasena Mlc Naga Babu

    వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • Avinash Reddy

    లోక్‌సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

Latest News

  • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

  • షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?

  • ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!

  • అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైన‌ల్‌.. భార‌త్ భారీ స్కోర్‌!

  • సొంత పార్టీ నేతలకు సీఎం రేవంత్ క్లాస్ ?

Trending News

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

    • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd