Andhra Pradesh: పురంధేశ్వరి సాయంతో చంద్రబాబు చీప్ పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వేడి మరింత పెరుగుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 30-08-2023 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వేడి మరింత పెరుగుతుంది. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో వైసీపీని ఏకిపారేస్తున్నాడు. ఇలా విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షాల వెంట తిరుగుతున్నారని, పగలు బీజేపీతో, రాత్రి రాహుల్ గాంధీతో పోరాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ఏపీకి రాగానే నల్ల బెలూన్లు ఎగురవేయడంతోపాటు అమిత్ షాపై టీడీపీ నేతలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధినేత్రి పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నీచ రాజకీయాలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు. బీజేపీ అభయహస్తంతోనే చంద్రబాబు గతంలో గెలవగలిగారు. లేదంటే ప్రజలెవ్వరూ చంద్రబాబుకు ఓట్లు వేయరని విమర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో పొత్తు గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదు అని సెటైర్లు వేశారు.
Also Read: Hurricane Idalia: అమెరికాకు తప్పని ముప్పు.. ముంచుకొస్తున్న ఇడాలియా?