దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
కల కనాలి.. దాన్ని సాధించాలి.. అని అంటారు మాజీ రాష్ట్రపతి, రాకెట్‌మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్‌తో ఫ్యూచర్‌ని ముందే చూసి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు.
- Author : Gopichand
Date : 31-12-2025 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu: ముంబై మహానగరంలో ఈ మధ్యే రెండో ఎయిర్‌పోర్టు పూర్తయింది. కానీ ఈ విమానాశ్రయం ఎప్పుడు ప్లాన్ చేశారో తెలుసా.. 90వ దశకంలో. అంటే దేశ ఆర్ధిక రాజధానిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పాతికేళ్లకు పైగా సమయం పట్టింది. బెంగళూరులో రెండో విమానాశ్రయం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వాలు పదేళ్ల నుంచి సరైన స్థలం కోసం అన్వేషిస్తున్నాయి. ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయింది. ట్రయల్ రన్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరు నెల్లలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయి. ముంబై, బెంగళూరుకి దశాబ్దాలు పట్టిన పని విశాఖలో రెండేళ్లలోపే పూర్తయిందంటే.. ఆ సక్సెస్ వెనుకున్న ఒన్ అండ్ ఓన్లీ పర్సన్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తెలంగాణ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2016లోనే ప్లాన్ చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి.. భూసేకరణ పూర్తి చేసి 2019లో విమానాశ్రయం పనులు ప్రారంభించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఎయిర్‌పోర్ట్ వర్క్‌ని ఆపేసింది. 2023లో అప్పటి సీఎం జగన్ మరోసారి శంఖుస్థాపన చేశారు గానీ.. పనులు ముందుకు వెళ్లలేదు. 2024లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరుగులు పెట్టించారు. కేవలం ఏడాదిన్నర సమయంలోనే.. అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేసిన రికార్డు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకే సొంతం.
Also Read: జనవరి నుండి జీతాలు భారీగా పెరగనున్నాయా?!
ఉమ్మడి రాష్ట్రంలో.. 5 వేల ఎకరాల్లో శంషాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ప్లాన్ చేసింది కూడా అప్పటి సీఎం చంద్రబాబు. ఇంత భారీ ఎయిర్‌పోర్టు ఎందుకని ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి.. ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకొచ్చి.. నిధులు సాధించి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వం మారినా.. బాబు ప్లాన్ ప్రకారమే విమానాశ్రయం నిర్మాణం జరిగింది. అందుకే పాతికేళ్ల తర్వాత ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య.. విమానాల ట్రాఫిక్ భారీగా పెరిగినా.. హైదరాబాద్‌కి మరో ఎయిర్‌పోర్టు అవసరం రాలేదు. అదీ చంద్రబాబు విజన్ అంటే.
కల కనాలి.. దాన్ని సాధించాలి.. అని అంటారు మాజీ రాష్ట్రపతి, రాకెట్‌మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్‌తో ఫ్యూచర్‌ని ముందే చూసి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన పనికి ప్రజలతో పాటు ప్రత్యర్ధులు కూడా ఫుల్ క్రెడిట్స్ ఇస్తారు. చంద్రబాబు విజన్‌కి ప్రతిరూపం.. ఆయన కృషి.. పట్టుదలకు తాజా నిదర్శనం విశాఖపట్నంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. చంద్రబాబు ఖాతాలో ఇది రెండో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. బాబుగారి ఊపు చూస్తుంటే.. త్వరలో అమరావతిలోనూ.. తర్వాత తిరుపతిలోనూ.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించడం ఖాయంగా కనిపిస్తోంది.