Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
- By Praveen Aluthuru Published Date - 04:13 PM, Fri - 7 June 24

Heritage Foods Stock: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారితో విజయం సాధించింది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి అధికార వైసీపీ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో కూటమి పోటీ ఇవ్వడం కాదు, క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తుందని పేర్కొంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అధికార వైసీపీ పార్టీ 11 సీట్లతో సరిపెట్టుకోగా బీజేపీ 8, జనసేన 21 సీట్లను కైవసం చేసుకుంది. అటు ప్రధాన పార్టీ టీడీపీ 135 సీట్లతో ప్రభంజనం సృష్టించింది.
లోకసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ అవసరం తప్పనిసరి అయింది. టీడీపీ 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టాలి అంటే టీడీపీ ఎంపీ సీట్లు అవసరం పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ గడ్డపై మరోసారి చంద్రబాబు పేరు మారుమ్రోగింది. ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఈరోజు 10 శాతం పెరిగి రూ.601.60కి చేరాయి.
Also Read: T20 World Cup 2024: ద్రవిడ్, రోహిత్ మాస్టర్ ప్లాన్ పాక్ ఆటగాళ్లకు నిద్ర పట్టడం లేదట