HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Seeks Ecs Intervention To Check Political Violence In Ap

Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు

  • Author : Vamsi Chowdary Korata Date : 19-03-2024 - 6:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

Chandrababu: ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. మరో 50 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తోందని, అధికారం పోతుందన్న భయంతో రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

వైఎస్సార్సీపీ గూండాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. గత రెండు రోజులుగా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైన విషయాన్నిప్రస్తావించారు. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం సభకు హాజరైనందుకు గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని గడికోటకు చెందిన మూలయ్యను దారుణంగా నరికి చంపగా, ఆళ్లగడ్డ సెగ్మెంట్‌లోని చాగలమర్రికి చెందిన 21 ఏళ్ల ఇమామ్ హుస్సేన్ కూడా నిర్దాక్షిణ్యంగా హత్యకు గురయ్యాడని, అలాగే మాచర్లలో టీడీపీ కార్యకర్తల కారుకు నిప్పు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు.

పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఈ మూడు ఘటనలకు బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ చేస్తున్న హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు (ఎస్పీలు) అందరూ అధికార యంత్రాంగం పాటలకు డ్యాన్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎస్పీల మద్దతును సద్వినియోగం చేసుకుని వైఎస్సార్‌సీపీ గూండాలు తమ తమ ప్రాంతాల్లో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతిభద్రతలపై ఎన్నికల సంఘం తక్షణమే దృష్టి సారించాలని, రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింసను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఇదిలా ఉండగా.. 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Anupama: ఆ క్యారెక్టర్లు చేసి బోర్ కొడుతుంది.. అందుకే బోల్డ్ గా నటించా: అనుపమ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • chandrababu
  • CM YS Jagan
  • Election commission
  • Faction
  • Model Code
  • violence

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd