HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbn Plan 45 45 Days Chandrababu Program Called Guarantee Of Future

CBN Plan 45 : భ‌విష్య‌త్ కు 45 రోజుల ప్రణాళిక‌, చంద్ర‌బాబు దూకుడు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Plan 45) ఏది చేసినా ఒక ప్ర‌ణాళిక ఉంటుంది. దానికి వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు, ల‌క్ష్యాలు ఉంటాయి.

  • Author : CS Rao Date : 02-09-2023 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN Plan 45
Chandrababu Mahanadu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Plan 45) ఏది చేసినా ఒక ప్ర‌ణాళిక ఉంటుంది. దానికి వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలు, ల‌క్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు 45 రోజుల ప్ర‌ణాళిక కూడా చంద్ర‌బాబు ల‌క్ష్యాన్ని ముద్దాడే దిశ‌గా రచించిన‌దే. దానిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల‌ను చుట్టేయ‌బోతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రూపు విభేదాల‌ను ఈ 45 రోజుల టూర్లో స‌రిచేయ‌బోతున్నారు. రాబోవు ఎన్నిక‌ల నాటికి ఐక్యంగా ప‌నిచేసే సంస్కృతిని తీసుకురావాల‌ని భావిస్తున్నారు. `బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ` అనే కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ప్రారంభించారు.

బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ (CBN Plan 45)

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ జోన్ 2 స‌మావేశాన్ని చంద్ర‌బాబు  (CBN Plan 45) శనివారం నిర్వ‌హించారు. స్థానిక లీడ‌ర్లు, క్యాడ‌ర్ తో మ‌మేకం అయ్యారు. రాబోవు 45 రోజుల పాటు ప్ర‌తి ఇంటికి వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రం ఎలా ఉంటుంది? అనే విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందు ఆవిష్క‌రించాల‌ని సూచించారు. మినీ మేనిఫెస్టోలోని అంశాల‌ను ప్ర‌జ‌లు తెలియ‌చేయాల‌ని ఆదేశించారు. ఆ మేనిఫెస్టోలో మ‌హాశ‌క్తి పేరిట మ‌హిళ‌ల‌కు ప‌లు ఉచిత స్కీమ్ ల‌ను ప్ర‌క‌టించారు. అలాగే, బీసీల‌కు ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు. రైతుల‌కు ఏడాదికి రూ. 20వేల స‌హాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని కల్పిస్తూ మ‌హిళ‌ల‌కు సౌక‌ర్యం క‌ల్పించారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

మినీ మ‌హానాడు అంశాల‌ను 45 రోజుల పాటు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌

మినీ మ‌హానాడులోని అంశాల‌ను ఈనెల 45 రోజుల పాటు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టాల‌ని రోడ్ మ్యాప్ ను ఇచ్చారు. అలాగే, 2019 నుంచి సాగిన పాల‌న కార‌ణంగా 20ఏళ్లు రాష్ట్రం వెనుక‌బ‌డిన విష‌యాన్ని ప్ర‌స్తావించాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బ‌ట‌న్ నొక్కే ప్ర‌భుత్వం మాత్ర‌మే ఉంద‌ని తెలియ‌చేయాల‌ని (CBN Plan 45) దిశానిర్దేశం చేశారు. వాస్త‌వంగా పారిశ్రామీక‌ర‌ణ‌, ఉద్యోగ‌, ఉపాథి అవ‌కాశాలు లేవ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద వ్య‌తిరేక‌త ఉంది. మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెనుక‌బ‌డ్డార‌ని మోజార్టీ ప్ర‌జ‌ల్లోని భావ‌న‌గా ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఆ అంశాల‌ను తెలియ‌చేస్తూ రాబోవు రోజుల్లో భ‌విష్య‌త్ కు బాబు ష్యూరిటీ ఇస్తున్నార‌ని ప్ర‌జ‌లకు తెలియ‌చేయాల‌ని చంద్ర‌బాబు ప్రోగ్రామ్ లోని ప్ర‌ధాన ఉద్దేశం.

Also Read : TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే 120 స్థానాల మీద క్లారిటీగా ఉన్న టీడీపీ మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌నుంది. సుమారు 50 నుంచి 60 స్థానాల వ‌ర‌కు గ్రూపు విభేదాలు ఉన్నాయ‌ని గుర్తించింది. వాటిని స‌రిచేసే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు తీసుకున్నారు. మునుప‌టి మాదిరిగా కాకుండా ఖ‌రాకండిగా అభ్య‌ర్థుల‌ను తేల్చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్ప‌టికే వైసీపీ నుంచి వ‌చ్చే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నార‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. తాము గేట్లు ఎత్తితే, వైసీపీ ఖాళీ అవుతుంద‌ని గ‌త వారం ఆయ‌న హెచ్చ‌రించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీలో ఉన్న వాళ్ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వైసీపీ నుంచి వ‌చ్చే వాళ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాంటి ప‌రిణామం గన్న‌వ‌రంలో జ‌రిగింది. అక్క‌డి వైసీపీ నేత యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు టీడీపీలోకి వ‌చ్చారు. వెంట‌నే ఆయ‌న‌కు అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఆయ‌న ఇప్ప‌టి నుంచి ప‌నిచేయ‌డం ప్రారంభించారు. ఇదే త‌ర‌హాలో రాష్ట్ర వ్యాప్తంగా క్లారిటీ ఇవ్వాల‌ని (CBN Plan 45)చంద్ర‌బాబు భావిస్తున్నారు.

Also Read : CBN Social Media : పొత్తు కోసం చంద్ర‌బాబుపై ఐటీ ప్ర‌యోగం?

ప్ర‌స్తుతం చేస్తోన్న 45 రోజుల `బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్ కు గ్యారంటీ` ప్రోగ్రామ్ ఒక వైపు సంస్థాగ‌త పార్టీని బ‌లోపేతం చేయ‌డం మ‌రో వైపు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేలా ద్విముఖ వ్యూహాన్ని చంద్ర‌బాబు ర‌చించారు. వై నాట్ పులివెందుల దిశ‌గా అడుగులు వేస్తోన్న ఆయ‌న టార్గెట్ 160 పెట్టుకున్నారు. ఆ దిశ‌గా కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం 45 రోజుల ప్రోగ్రామ్ విజ‌య‌వంతమైతే టార్గెట్ 160 ని చేరుకున్న‌ట్టే ఆయ‌న భావిస్తున్నారు. అందుకే, జిల్లా,మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, గ్రామ స్థాయి లీడ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. బూతు స్థాయి లీడ‌ర్ల వ‌ర‌కు ఈ ప్రోగ్రామ్ చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. కుటుంబ సార‌థుల ఎంపిక పూర్తి చేసి, ఈ కార్య‌క్ర‌మంలో వాళ్ల‌ను కీల‌క భాగ‌స్వాముల‌ను చేయాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. దీంతో ఉత్సాహంగా టీడీపీ సైన్యం ముందుకు క‌దులుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • 2024 AP elections
  • Andhra Pradesh TDP
  • chandrababu naidu

Related News

Vijayasai Reddy about amaravati

Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

Amaravati  ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై ‘కమరావతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ

    Latest News

    • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

    • Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!

    • Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

    • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

    • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd