HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Shock For Ycp Former Mla Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్‌!

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

  • Author : Gopichand Date : 19-01-2025 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thopudurthi Prakash Reddy
Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి (Thopudurthi Prakash Reddy) భారీ షాక్ త‌గిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందుపై రాప్తాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు. బీఎన్ఎస్ 75, 79, 351(2), 196, 352, 353 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశామ‌ని రాప్తాడు పోలీసులు తెలిపారు. గ‌తంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే సోద‌రుడు అనుచిత వ్యాఖ్యలు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో ఆఫీసులో చంద్రబాబు, లోకేష్‌పై మాజీ ఎమ్మెల్యే సోద‌రుడు చందు అమానవీయ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో మొద్దు శ్రీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెప్పి ఉంటే.. చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని చంపేవాడ్ని తోపుదుర్తి చందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చందు వ్యాఖ్యలపై ఆనాడే టీడీపీ నేత‌లు భ‌గ్గుమ‌న్నారు. చందు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, చంద్ర‌బాబుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాప్తాడు పోలీసుల‌కు సైతం ఆనాడు టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఆ ఫిర్యాదుల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోపుదుర్తి చందుపై అనంతపురం ఎస్పీకి టీడీపీ బీసీ నేత‌లు ఫిర్యాదు చేయ‌గా.. తాజాగా రాప్తాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Also Read: Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. భార‌త్ జ‌ట్టులోకి మ‌రో ముగ్గురు ఆట‌గాళ్లు?

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవ‌రు?

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 1950 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాప్తాడు నియోజకవర్గవైసీపీ ఇంఛార్జ్ గా నియమితుడయ్యాడు.

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత పై 25,575 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2021లో తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నికకు నియోజకవర్గం పరిధిలోని సూళ్ళూరుపేట నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • CM CBN
  • Minister Lokesh
  • Raptadu
  • Thopudurthi Chandhu
  • Thopudurthi Prakash Reddy
  • ysrcp

Related News

Ap Cm Chandrababu Naidu

చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Ap Cm Chandrababu Naidu  ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు కూాడా తగ్గిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సీఎం. ఆంధ్

  • Ap Ev Charging Stations

    ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • AI Services In AP Government Hospitals

    ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd