Crime: నంద్యాలలో బిచ్చగాడు దస్తగిరి హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Crime: తక్కువ బడ్జెట్‌తో వచ్చిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడమే కాక, తల్లికి చేయూతనిచ్చే కొడుకును చూపించి భావోద్వేగానికి గురి చేసింది.
- By Kavya Krishna Published Date - 06:12 PM, Thu - 3 July 25

Crime: తక్కువ బడ్జెట్‌తో వచ్చిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడమే కాక, తల్లికి చేయూతనిచ్చే కొడుకును చూపించి భావోద్వేగానికి గురి చేసింది. అయితే సినిమాల్లో చూపించినట్లే నిజ జీవితంలో కూడా భిక్షాటన వెనుక కొన్ని గాఢమైన నిజాలు ఉన్నాయని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్న దస్తగిరి హత్య ఘటన వెల్లడించింది. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఓ బిచ్చగాడిని దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసులను ఆందోళనకు గురిచేసింది. దస్తగిరి అనే వ్యక్తి గతంలో కుటుంబ విభేదాల వల్ల నంద్యాలకు వచ్చి రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ బిక్షాటన చేస్తుండేవాడు.
YS Sharmila : కరేడులో భూసేకరణపై షర్మిల ఆగ్రహం..రైతుల పక్షంలో ఉద్ధృత పోరాటం చేపడతాం
ఒక రాత్రి, రహ్యుం అనే యువకుడు మద్యం మత్తులో దస్తగిరిని లేపి డబ్బు ఇవ్వమని బెదిరించాడు. వంద రూపాయల నోటు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంతో రహ్యుం బండరాయితో దస్తగిరి తలపై మోసి, హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసును ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు విచారణలో మరో నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. బిచ్చగాళ్ల ముసుగులో తిరుగుతున్న 120 మంది భిక్షాటకులలో 30 మందికి క్రిమినల్ రికార్డు ఉన్నట్టు తేలింది.
Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్
వారి ఫింగర్‌ప్రింట్లు సేకరించి, టెక్నికల్ విశ్లేషణ చేయగా ఈ విషయం బయటపడింది. షెల్టర్ జోన్లుగా రైల్వే స్టేషన్లు, ఫ్లై ఓవర్ ప్రాంతాలు మారుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. భిక్షాటన వెనుక దాగిన నేర గుట్టును ఈ కేసు బట్టబయలు చేసింది.