HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Be Careful With Restaurants Shocking Facts About Guntur Hotels

రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 11-02-2026 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Food Safety Officer Inspection guntur
Food Safety Officer Inspection guntur

Food Safety Officers Inspection  గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్‌ను వారం రోజులుుగా ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తింటే డయేరియా బారిన పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, నాణ్యత లేని పదార్థాలు అందిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ మధ్యకాలంలో సొంతింటి ఆహారం తినేవారి కన్నా, హోటల్స్, రెస్టారెంట్ ఫుడ్ తినేవారు ఎక్కువయ్యారు. ఇంటి భోజనం అందుబాటులో లేకపోవటం, వంట రాకపోవటంతో పాటు వివిధ పరిస్థితుల కారణంగా బయటి ఆహారం వైపు మొగ్గు చూడాల్సిన పరిస్థితి. నేరుగా హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లేవారు కొందరైతే.. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే లాగించేవాళ్లు మరికొందరు. అయితే మీరు తినే ఆహారం ఎంతవరకూ నాణ్యమైనదీ, ఎంత వరకూ సురక్షితమైనదని అనుకుంటున్నారని అడిగితే.. కచ్చితంగా అవును అని సమాధానం ఇచ్చేవారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏదైనా హాటల్స్, రెస్టారెంట్లకు మీరు వెళ్లినప్పుడు అక్కడి ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేదని మీకు అనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం రోజున పలు హోటల్స్, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశారు. రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, బేకరీలలో తూనికలు-కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు జరిపారు. పది టీములుగా ఏర్పడి అరండల్ పేట, బ్రాడీపేట, లాలాపేట, కింగ్స్‌ హోటల్‌ సెంటర్, బృందావన్‌ గార్డెన్స్‌ సెంటర్, లక్ష్మీపురం, నగరాలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీపురంలో ఓ రెస్టారెంట్‌లో 60 కిలోల చికెన్, మటన్‌లను రెస్టారెంట్ నిర్వాహకులు వారం రోజులుగా ఫ్రిజ్‌లో నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు.

ఒక స్వీట్ షాపులో పూర్ణాల పిండిని కూడా భారీ మొత్తంలో ఫ్రిజ్‌లో దాచిన విషయాన్ని గుర్తించారు. మాంసాహారాన్ని ఇలా ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వచేయటం వల్ల ఫంగస్‌ వ్యాపిస్తుందని.. ఈ ఆహారాన్ని తిన్నవారు డయేరియాకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నవారికి నోటీసులు జారీ చేశారు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో కొంతమంది రెస్టారెంట్ల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు.

మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకుని.. పలువురు నిర్వాహకులు తమ హోటల్స్, రెస్టారెంట్లను మూసేశారు.హోటల్స్, రెస్టారెంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ, నాణ్యత లేని ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. 94403 79755 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Food Safety
  • food safety officers
  • Food Safety Officers Inspection
  • Food safety regulations
  • guntur
  • hotels
  • Restaurants

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిష

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd