Bandla Ganesh: బండ్ల గణేష్‌కు కోపమొచ్చింది.. చంద్రబాబు రాజకీయంపై హాట్ కామెంట్స్
ఓ నెటిజన్ .. ఇదే నిజమైతే బీజేపీతో టీడీపీ పొత్తు ఆత్మహత్యే.. అంటూ ట్విట్టర్లో ఓ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌ను బండ్ల గణేష్ ట్యాగ్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలపై హాట్ కామెంట్స్ చేశారు.
- By News Desk Published Date - 09:30 PM, Sun - 4 June 23

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తాజా రాజకీయాలపై పలుసార్లు ఆయన చేసే కామెంట్స్ సంచలనంగా మారుతుంటాయి. తాజాగా మరోసారి గణేష్ ట్వీట్ రాజకీయ రచ్చకు కారణమైంది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో గణేష్ ట్వీట్ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్‌షా(Amit Shah), బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకే వారితో చంద్రబాబు భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ నెటిజన్ .. ఇదే నిజమైతే బీజేపీతో టీడీపీ పొత్తు ఆత్మహత్యే.. అంటూ ట్విట్టర్లో ఓ కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌ను బండ్ల గణేష్ ట్యాగ్ చేస్తూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలపై హాట్ కామెంట్స్ చేశారు. కర్మ కాకపోతే ఇంకేంటి. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి. బీజేపీ అంటే బీజేపీ అనాలి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనెంట్ గా ఏ పేరు చెబితే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అంతేగానీ ఎవరికి ఆత్మాభిమానం, మంచి చెడు మానవత్వం ఉండదు. ఆయన్ను పొగిడితే జాతిని పొగిడినట్లు. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్లు. ఇంతకంటే ఏం కావాలి దరిద్రం అంటూ చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు.
బండ్ల గణేష్ ట్వీట్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా రీ ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోని పార్టీ పేరు చెప్పడంటూ కొందరు వ్యంగ్యంగా రీ ట్వీట్ చేయగా.. మరికొందరు.. కాంగ్రెస్‌ను వదిలేస్తున్నందుకు గణేష్‌కు బాధగా ఉన్నట్లుంది అంటూ కామెంట్స్ చేశారు. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా బండ్ల గణేష్ ట్వీట్ చేసిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు. కానీ, మొదటిసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఆయన పేరు ప్రస్తావించకుండా బండ్ల గణేష్ ట్వీట్ చేయడం తెలుగుదేశం శ్రేణులను కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కర్మ కర్మ కాకపోతే ఇంకేంటి ఆయన సిపిఎం అంటే సిపిఎం అనాలి బిజెపి అంటే బిజెపి అనాలి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి.జనసేన అంటే జనసేన అనాలి ఆయన కన్వీనెంట్గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి అంతేగాని ఎవరికి ఆత్మవిమానం మంచి చెడు మానవత్వం… https://t.co/gNAei7TQxs
— BANDLA GANESH. (@ganeshbandla) June 4, 2023
Also Read : Telangana BJP : టీడీపీతో కలిస్తే తెలంగాణలో బీజేపీకి లాభమా? నష్టమా? టీబీజేపీ ఎందుకు భయపడుతుంది?