Janasena : 26న పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న బాలినేని..
Balineni : జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు.
- Author : Latha Suma
Date : 22-09-2024 - 7:06 IST
Published By : Hashtagu Telugu Desk
Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు. పవన్ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని 15 రోజుల క్రితమే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు.
Read Also: Another Controversy : తిరుమల లడ్డులో ‘గుట్కా ప్యాకెట్’.. భక్తురాలు షాక్
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుందని.. విచారణ చేసుకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. విచారణ చేసుకోవచ్చని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారన్నారు. తాను విచారణ విషయంలో కాంప్రమైజ్ ఏమీ కానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏవైనా తప్పులు జరిగినా ప్రశ్నిస్తామన్నారు. తాను ఇటీవల మాట్లాడిన సందర్బంలో కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే ఫైనల్ అని చెప్పానన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నీ పనులు చేసుకుంటారని.. అన్నీ విషయాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఫ్లెక్సీలు ఎవరు కట్టారో కూడా తనకు తెలియదని.. జనార్దన్ ఫోటో పెట్టారని అన్నీ తొలగించారన్నారు, ఈసారి ఫ్లెక్సీలు పెడితే ఆయన ఫోటో పెట్టవద్దని మా వాళ్లకు చెబుతామన్నారు. జనసేనలోకి వెళ్తుంటే కామెంట్ చేస్తున్నారు.. టీడీపీలోకి ఎవరైనా వెళ్లినా ఇలాగే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.