Another Controversy : తిరుమల లడ్డులో ‘గుట్కా ప్యాకెట్’.. భక్తురాలు షాక్
Another Controversy : తిరుమల లడ్డు ప్రసాదంలో 'గుట్కా ప్యాకెట్' రావడం భక్తులను మరింత షాక్ గురి చేస్తుంది
- By Sudheer Published Date - 06:58 PM, Sun - 22 September 24

Tirumala Laddu Another Controversy : ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారుచేశారనే వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివాదంగా మారిన సంగతి తెలిసిందే . దీనిపై యావత్ హిందువులు , రాజకీయ నేతలు , ఇలా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగానే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదంలో ‘గుట్కా ప్యాకెట్’ రావడం భక్తులను మరింత షాక్ గురి చేస్తుంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పందికొవ్వు, జంతువుతల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్న వేళ…ఇప్పుడు ఏకంగా గుట్కా పాకెట్ బయటపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
ఖమ్మంలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోన్న దొంతు పద్మావతి అనే మహిళ.. సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. వచ్చేటప్పుడు బంధువుల కోసం, ఇంటిపక్కల ఉన్న వారికి ప్రసాదం ఇవ్వడానికి లడ్డులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. .ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీసింది. లడ్డులో గుట్కా ప్కాకెట్ (Gutka Packet) కనిపించేసరికి షాక్ కు గురైంది. అత్యంత పవిత్రంగా భావించే లడ్డులో.. జీడిపప్పు, కిస్మిస్ , యాలకులు ఉంటాయని అనుకున్న మహిళ.. గుట్కాప్యాకెట్ ఉండటం చూసి నివ్వేరపోయింది. గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది. దీనిపై హిందు సంఘాలు మండిపడుతున్నాయి.
Read Also : Chiranjeevi Guinness Record : మెగాస్టార్ ఖాతాలో మరో రికార్డ్