HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Assurance On Heritage Quality Delhi High Court Checks False Propaganda

హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.

  • Author : Gopichand Date : 19-02-2026 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heritage Promise
Heritage Promise

Heritage Promise: గత 33 ఏళ్లుగా కోట్లాది కుటుంబాలకు తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను అందిస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగిన హెరిటేజ్ ఫుడ్స్ నాణ్యతపై సంస్థ అధినేత, సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి కీలక సందేశాన్ని ఇచ్చారు. రూ. 4 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు రూ. 4,000 కోట్ల స్థాయికి చేరినప్పటికీ నాణ్యత విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఉత్పత్తి వినియోగదారుడికి చేరే ముందు 25 రకాల కఠినమైన నాణ్యత పరీక్షలను దాటుతుందని, దాదాపు 500 మంది నిపుణులు ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తారని భువనేశ్వరి పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లోని 3 లక్షల మంది పాడి రైతులతో పారదర్శకత, సరైన ధర, సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో హెరిటేజ్ ముందుకు సాగుతోందని వివరిస్తూ “చూసిందే నమ్మండి” (#HeritagePromise) అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

సాక్షి మీడియాకు బిగ్ షాక్‌

మరోవైపు హెరిటేజ్ ఫుడ్స్‌పై రాజకీయ ప్రేరేపిత నిరాధార ఆరోపణలు చేసిన సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు, బోలేబాబా డెయిరీకి మధ్య సంబంధం ఉందంటూ సాక్షిలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది. ఈ మేరకు హెరిటేజ్‌పై టెలికాస్ట్ చేసిన అన్ని అసత్య వార్తల లింక్‌లను 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ సాక్షి యాజమాన్యం ఈ లింక్‌లను తొలగించడంలో విఫలమైతే మెటా, గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలు తక్షణమే ఆ కథనాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.

ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు… pic.twitter.com/xan0wUyxz7

— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 19, 2026

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ “వెంకన్న విన్నాడు.. నిజాన్ని గెలిపించాడు” అని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నిరూపణ లేని వార్తలను ప్రసారం చేయడం సరికాదని, చివరకు న్యాయమే విజయం సాధించిందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. రైతు సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న తమ సంస్థపై ఇలాంటి కుట్రలు సాగవని హెరిటేజ్ యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • delhi high court
  • FalsePropaganda
  • heritage
  • Heritage Foods
  • Heritage Promise
  • Heritage Quality
  • nara bhuvaneswari

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • BR Naidu

    తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

  • Delhi High Court Rejects Ilaiyarajaa's Copyright Claim

    ఇళయరాజా కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd