HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apsrtc Will Have All Electric Buses In The Next Five Years

Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్

టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్‌ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో  ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది.

  • Author : Pasha Date : 17-12-2024 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleeper Coach Buses
Sleeper Coach Buses

Electric Buses : వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. 2029 నాటికి ఆర్టీసీకి చెందిన  డీజిల్‌ బస్సుల స్థానాన్ని పూర్తిస్థాయిలో  ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. టీడీపీ సర్కారు ఇటీవలే తీసుకొచ్చిన ‘విద్యుత్‌ వాహనాల విధానం 2024-29’కి (Electric Buses) అనుగుణంగా ఈ లక్ష్యంతో  ఏపీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతోంది. 2029 సంవత్సరంకల్లా ఆర్టీసీ సొంత బస్సులు 10,155, అద్దె బస్సులు 2,562 కలుపుకొని మొత్తం 12,717 బస్సులు ఎలక్ట్రిక్‌వే ఉండేలా ప్రణాళికను రెడీ చేస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర సగటున రూ.1.80 కోట్ల దాకా ఉంటుంది. ఇంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి భారమే అవుతుందని అంటున్నారు. ఏపీలోని 11 నగరాలకు ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవ పథకం కింద 750 ఎలక్ట్రిక్  బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100 చొప్పున, అమరావతి, అనంతపురం, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతిలకు 50 చొప్పున మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.35 లక్షల దాకా ఆయా కంపెనీలకు  సబ్సిడీ ఇస్తోంది.

Also Read :Formula E Car Race : రేపోమాపో కేటీఆర్‌పై కేసు.. గవర్నర్ అనుమతి వివరాలు ఏసీబీకి !

  • 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కు (స్క్రాప్‌)గా పరిగణిస్తారు. ఈ రూల్ ప్రకారం రాబోయే ఐదేళ్లలో 2,537 ఆర్టీసీ బస్సులు తుక్కుగా మారుతాయి. వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులను కొంటారు.
  • ఇతరత్రా కేటగిరీలకు చెందిన మరో 5,731 బస్సులను కూడా వచ్చే ఐదేళ్లలో పక్కన పెట్టి.. కొత్తవి కొంటారు. ఇలా పక్కన పెట్టనున్న బస్సుల జాబితాలో… 12 లక్షల కి.మీ. తిరిగిన ఏసీ బస్సులు, 10 లక్షల కి.మీ. తిరిగిన సూపర్‌ లగ్జరీ బస్సులు, అల్ట్రా డీలక్స్‌ బస్సులు, 8 లక్షల కి.మీ. నడిచిన ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 6.5 లక్షల కి.మీ నడిచిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 8 లక్షల కి.మీ నడిచిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 12 లక్షల కి.మీ దాటిన పల్లెవెలుగు బస్సులు, 13 లక్షల కి.మీ తిరిగిన సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి.
  • 2029లో కొత్తగా తీసుకోబోయే 1,285 అద్దె బస్సులు, 2025-29 వరకు కొత్తగా పెంచబోయే 1,698 బస్సులు, 2029లో అదనంగా చేర్చబోయే 2,726 బస్సులు కూడాఎలక్ట్రిక్‌వే ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.

Also Read :Travel Tips : మీరు ఆన్‌లైన్‌లో హోటల్ లేదా గదిని బుక్ చేస్తుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోండి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap govt
  • apsrtc
  • electric buses

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd