Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
- By Latha Suma Published Date - 12:59 PM, Fri - 9 May 25

Murali Naik : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశ సరిహద్దుల్లో తిరిగి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ సర్జికల్ దాడికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్ ఆగ్రహంతో వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ భారత సరిహద్దులపై క్షిపణులు, డ్రోన్ దాడులకు తెగబడుతోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు.
జమ్మూ కాశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పాక్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహం #IndiaPakistanWar #IndianArmy #OperationSindoor #HashtagU #IndianNavy pic.twitter.com/6RLiO5Ivxi
— Hashtag U (@HashtaguIn) May 9, 2025
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శనివారం ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి తరలించనున్నట్లు సమాచారం.
మురళీ నాయక్ చిన్నతనం నుంచి దేశసేవపై ఆసక్తితో పెరిగాడు. సోమందేపల్లి మండలంలోని నాగినాయని చెరువుతండాలో ఆయన బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యను సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో పూర్తి చేశాడు. బాల్యంలోనే సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ముందుకెళ్లి దేశానికి సేవలందించాడు.
వీర జవాన్ మురళీ నాయక్ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబసభ్యులు వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద అలుముకున్న విషాదఛాయలు పాక్ కాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా #IndiaPakistanWar #IndianArmy pic.twitter.com/HScZpPVp7j
— Hashtag U (@HashtaguIn) May 9, 2025
ఈ దుర్ఘటన విని గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మురళీ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సైనిక అధికారులంతా కలిసి ఆయన కుటుంబానికి ఓదార్పు తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరవదు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించే వీరులకు ఇది తగిన గౌరవంగా నిలుస్తుంది.