IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
- By Gopichand Published Date - 12:41 PM, Fri - 9 May 25

IPL 2025 Called Off : భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ బోర్డు ఐపీఎల్ 2025ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025లో 57 మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
టికెట్ రీఫండ్ నియమాలు
ఐపీఎల్ నియమాల ప్రకారం.. మ్యాచ్ పూర్తిగా రద్దై, ఒక్క బంతి కూడా వేయకపోతేనే రీఫండ్ సాధ్యం. ధర్మశాల మ్యాచ్‌లో 10.1 ఓవర్లు ఆడినందున రీఫండ్ క్లెయిమ్ చెల్లదు. అయితే టోర్నమెంట్ రద్దు కావడంతో రీఫండ్‌కు సంబంధించి కొత్త ప్రకటనలు రావచ్చు. తాజా సమాచారం కోసం ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా టికెట్ ప్లాట్‌ఫారమ్‌లను సంప్రదించాలి.
ప్రస్తుత పరిస్థితి
పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినప్పటికీ భారత ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా అడ్డుకుంది. భద్రతా కారణాల వల్ల ఉత్తర భారతంలోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్‌లు అమలు చేశారు. ప్రజలను ఇండ్లలోనే ఉండమని సూచించారు. బీసీసీఐ ఈ నిర్ణయం విదేశీ ఆటగాళ్ల భద్రత, లాజిస్టిక్స్, ప్రభుత్వ సూచనలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంది.
దాదాపు ఐపీఎల్ రద్దు?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. టోర్నీని రద్దు చేసి, విదేశీ ఆటగాళ్లను ఆయా దేశాలకు పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఐపీఎల్ లీగ్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను అర్దాంతరంగా రద్దు చేశారు.
Read Also: Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు