Electricity Bill : బంగారం షాపుకి కోటి రూపాయల కరెంట్ బిల్లు.. షాక్ గురైన యాజమాని
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక షాపు యజమాని కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు.
- By Prasad Published Date - 11:29 AM, Tue - 3 October 23

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక షాపు యజమాని కోటి రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు. కొత్తూరు పట్టణంలోని చిన్న నగల దుకాణం నిర్వహిస్తున్న యజమాని జి.అశోక్‌కు సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వినియోగించిన కరెంటుకు రూ.1,01,56,116 బిల్లు వచ్చింది. పాలకొండ రోడ్డులోని దుర్గా జ్యువెలర్స్ యజమాని ఆ బిల్లును చూసి షాక్ తిన్నారు. ఎప్పుడూ సగటున నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు బిల్లు వస్తుందని అశోక్ తెలిపారు. బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించగా పరిశీలించి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇచ్చారని యాజమాని తెలిపారు. ఏపీలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. పూరి గుడిసెలో ఉండే వారికి కూడా వేలల్లో కరెంట్‌బిల్లులు వచ్చాయి. దీంతో వారంతా అయోమయానికి గురైయ్యారు. అయితే సిబ్బంది తప్పిదమా.. లేక ఇంకేమైనా ఛార్జీలు రూపంలో కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.