HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Police Campaign Religion In Challan Form

AP Govt: ఏపీ పోలీసుల ఏసుక్రీస్తు బాట‌, చ‌లాన్ల వెనుక బోధ‌న‌లు!

ఏపీలో మ‌త పిచ్చి ముద‌రి పాకాన‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చ‌లాన్ల మీద ఏసు క్రీస్తు ప్ర‌బోధాలు ఉండ‌డం చూస్తే మ‌తం ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింద‌ని అర్థం అవుతోంది.

  • By CS Rao Published Date - 11:37 AM, Sat - 26 November 22
  • daily-hunt
Ap Police
Ap Police

ఏపీలో మ‌త పిచ్చి ముద‌రి పాకాన‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చ‌లాన్ల మీద ఏసు క్రీస్తు ప్ర‌బోధాలు ఉండ‌డం చూస్తే మ‌తం ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింద‌ని అర్థం అవుతోంది. స్థానికంగా ఉండే బీజేపీ నేత‌లు నిల‌దీయ‌డంతో పోలీసులు నాలుక్క‌రుసుకున్నారు. క్రీస్తు బోధ‌న‌ల‌తో ఉండే ర‌సీదుల జారీపై వాళ్లు కుంటిసాకులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

విశాఖ‌ రైల్వే స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ మ‌త ప్ర‌చారం వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. ఆటో ల‌కు జారీ జారీ చేసిన రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి. వాటిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై విమర్శలతో పాటు బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న‌కు దిగింది. విశాఖ పోలీసులు ఈ రసీదుల జారీపై స్పందించారు. ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇవ్వ‌డం కొస‌మెరుపు.

గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు వారి సంస్థల పేరుతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లకు బ‌దులుగా ఏసుక్రీస్తు బోధ‌న‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహన్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన 2019 వ సంవ‌త్స‌రంలో తిరుమ‌ల బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం ప్ర‌చారం ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన హిందూ సంస్థ‌లు రివ‌ర్స్ కావ‌డంతో వాటిని ఆపేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ట్రాఫిక్ చ‌లాన్ల వెనుక ఏసుక్రీస్తు బోధ‌న‌లు ఉండ‌డం రాజకీయ వివాదానికి దారితీస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • ap police
  • religion
  • vizag

Related News

Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దుకుంది.

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

Latest News

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd