HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Assembly Special Session Ayanna Patrudu

AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 3:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Speaker Ayyanna Patrudu
Speaker Ayyanna Patrudu

Ayyanna Patrudu అమరావతి రాజధాని విషయంలో ఐదేళ్లుగా సాగుతున్న అస్పష్టతకు, రాజకీయ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న ‘లీగల్ గ్యాప్’ను భర్తీ చేయడమే ఈ స్పెషల్ సెషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధాని అని సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు జరగనున్న నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ పంపే ఈ తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయిస్తామని వెల్లడించారు.

ఈ ప్రక్రియ గనుక పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడం లేదా మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించడం సాధ్యం కాదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో ప్రత్యేక సమావేశం జరుగుతుందని స్పీకర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati's capital city
  • Andhra Pradesh Capital
  • Andhrapradesh
  • ap assembly
  • ap legislative assembly
  • ayyanna patrudu
  • Capital City
  • Special Session

Related News

Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.

Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. టీడీపీ ‘అమరావతి’ అంటుంటే, వైసీపీ ‘మావిగన్’ అనడం వంటి అర్థరహిత వాదనలను పక్కనపెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై దృష్టి సారించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో సుమ

  • Pawan meets Maharashtra CM Devendra Fadnavis; expresses gratitude for providing two tigresses to AP.

    Pawan Kalyan: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd