HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another New Port In The Same District Announced By Chief Minister Chandrababu

ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !

  • Author : Vamsi Chowdary Korata Date : 30-12-2025 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dugarajapatnam Port
Dugarajapatnam Port

Dugarajapatnam Port : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన పోర్టులు 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో పోర్టు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ మరో పోర్టు ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది. కాగా, ఈ పోర్టుల నిర్మాణం ద్వారా పెట్టుబడులు.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పోర్టు
  • తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు
  • స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన ఓడరేవుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అందులో మూడు పోర్టులు 2026 చివరి నాటికల్లా పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మరో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో కొత్త పోర్టు నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో పాటు పశ్చిమ గోదారవి జిల్లాలోనూ మరో పోర్టు ఏర్పాటుకు అనువైన ప్రదేశం వెతకాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు.

తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం ఓడరేవుతో పాటు నౌకా నిర్మాణ కేంద్రం కూడా నిర్మస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీరం ఉన్నందున.. పోర్టులు నిర్మించిన ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఇస్తే.. పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరిగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. నెల్లూరులో కృష్ణపట్నం, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టులు ఉన్నాయని.. తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే.. అది ఒక కారిడార్‌లా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నేపథ్యంలో కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అవసరమైన ప్రక్రియల్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వాటితో పాటు నాగార్జున సాగర్, బొబ్బిలి, దొనకొండ.. ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేయాలని అన్నారు.

కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులు మరింత చురుకుగా పని చేయాలని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 2025లో మెరుగ్గా పని చేశామని.. 2026లో మరింత మెరుగ్గా పని చేయాలని చెప్పారు. యోగాంధ్ర, విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం చేశామన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబుడుల తీసుకొచ్చామన్నారు. ఇదే ప్రభుత్వ అతిపెద్ద విజయమన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ సాయంతో పోలవరం, అమరావతిలోని చాలా ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టామని, రైల్వే జోన్ కొలిక్కి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా రూ. 50 వేల కోట్లకు పైగా పింఛన్లు అందజేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కేబినెట్ సమావేశానికి మంత్రి ఆలస్యం..

కేబినెట్ సమావేశంలో అధికారులు, మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అహసనం వ్యక్తం చేశారు. మీటింగ్‌కు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలస్యంగా వచ్చారు. దీనికి తోడు అధికారులు సిద్ధంగా లేరు. దీంతో రెవెన్యూ శాఖకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే శాఖకు సంబంధించిన ఎజెండా అంశం ముందు ఉన్నా చివర్లో ఉన్నా.. మంత్రులు, అధికారులంతా సమావేశం ప్రారంభమయ్యే ముందే సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎవరూ ఆలస్యంగా రాకుండా ఆదేశాలు ఇవ్వాలని ఇంఛార్జి సీఎస్‍కు సూచించారు సీఎం చంద్రబాబు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu Naidu
  • Dugarajapatnam Port
  • Tirupati

Related News

CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధు

  • Chandrababu

    Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

  • Serious action against Vizag Steel Plant officials

    Visakhapatnam Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అధికారులపై సీరియస్

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Latest News

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

  • Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్‌

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd