HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Massive Investment In Ap

AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2026 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another massive investment in AP.
Another massive investment in AP.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్) పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ కాంప్లెక్స్, రిఫైనరీ ఏర్పాటు చేయనుండగా.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,042.46 ఎకరాలను బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ భూమి బదిలీకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయిస్తూ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల డైరెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం.

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఏకంగా రూ.96,862 కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. బీపీసీఎల్ భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ముందు 6 వేల ఎకరాలను కేటాయించగా, తాజాగా 6,042 ఎకరాలను వ్యయ ప్రాతిపదికన బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది. బీపీసీఎల్‌కు భూముల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. మొత్తం 6,042 ఎకరాలకు సంబంధించి స్టాంప్‌ డ్యూటీ కింద రూ.127.68 కోట్లు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.19.64 కోట్ల మినహాయింపు ఇచ్చారు. మొత్తం రూ.147.33 కోట్లకు పైగా బీపీసీఎల్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

బీపీసీఎల్‌కు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు 480.89 ఎకరాలను బదిలీ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెండు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీపీసీఎల్‌కు కేటాయిస్తున్న 6,042 ఎకరాల భూసేకరణ ప్రక్రియ తర్వాత పట్టా భూముల మ్యూటేషన్‌కు చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఏపీఐఐసీ, ఏపీ మ్యారీటైం బోర్డు, రాష్ట్ర పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం మీద బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. త్వరలోనే శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh government
  • BPCL In AP
  • Nellore district

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd