HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Is Best For Investments Cm Chandrababu Naidu

CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్: సీఎం చంద్రబాబు నాయుడు

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2026 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arcelor Mittal Steel Plant Foundation
Arcelor Mittal Steel Plant Foundation

Andhra Pradesh CM Chandrababu Naidu  అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని వెల్లడించారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాజయ్యపేటలో ఏర్పాటవుతోందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు మద్దతునిస్తున్న పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. 5,465 ఎకరాల్లో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు కాదు, స్టీల్ సిటీకి శంకుస్థాపన చేశామన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. రెండు దశలలో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. డిసెంబర్ 2028 నాటి నుంచి స్టీల్‌ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నాయకుడు కావాలని, అది చంద్రబాబు వల్లే సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ దురంధరుడు చంద్రబాబు వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధ, చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వలన రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతోందని కొనియాడారు.

మరోవైపు సుమారు లక్షా 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణం రెండు దశలలో జరగనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anakapalli
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan
  • Andhrapradesh
  • Arcelor Mittal Steel Plant
  • Arcelor Mittal Steel Plant Foundation
  • Minister Nara lokesh

Related News

The date has been fixed for the 'Thalliki Vandanam' amount to be credited to your account.

Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd