HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Government Plans To Set Up A Care Center In Every District For Dogs

Dogs Care Centers : కుక్కల కోసం ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రం.. సర్కారు యోచన 

ఏపీలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు  4,33,751 వీధి కుక్కలు(Dogs Care Centers) ఉన్నాయి.

  • Author : Pasha Date : 25-11-2024 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dogs Care Centers in AP Districts

Dogs Care Centers : మన దేశంలో ఏటా అత్యధికంగా కుక్కకాటు కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.  2022 సంవత్సరంలో మహారాష్ట్రలో సగటున 3,46,318 కుక్కకాటు కేసులు నమోదవగా, తమిళనాడులో 3,30,264 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1,69,378 కుక్క కాటు కేసులతో ఆ ఏడాదిలో దేశంలోనే  మూడో స్థానంలో నిలవడం ఆందోళన రేకెత్తించే అంశం. ప్రత్యేకించి ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే.. గత తొమ్మిది నెలల వ్యవధిలో ఏపీలోని ఒక్కో జిల్లాలో సగటున 6వేల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందుకే ఇప్పుడు వీధి కుక్కల నియంత్రణపై టీడీపీ సర్కారు ఫోకస్ పెట్టింది.

Also Read :Ram Gopal Varma : రాంగోపాల్‌ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ ?

ఏపీలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు  4,33,751 వీధి కుక్కలు(Dogs Care Centers) ఉన్నాయి. 2025 సంవత్సరం మార్చిలోగా రాష్ట్రంలోని పట్టణాల్లో 2,01,213 వీధి కుక్కలకు గర్భనిరోధక శస్త్ర చికిత్సలు చేసి, వ్యాక్సినేషన్‌ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతపురం జిల్లాలో మూతపడిన కుక్కల సంరక్షణ కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని అనుకుంటోంది. కుక్క కాట్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో వీధి కుక్కలను పట్టుకొని ప్రత్యేక వసతి గృహాల్లో సంరక్షించాలని సర్కారు యోచిస్తోంది.

Also Read :Telangana Airports : తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు.. వచ్చే ఏడాది ‘మామునూరు’ రెడీ

కుక్కలు ఎందుకు కరుస్తున్నాయ్ ?

కుక్కలు మనిషికి చాలా సన్నిహితంగా ఉంటాయి. సెక్యూరిటీని కూడా ఇవి అందిస్తాయి. పెంపుడు జంతువుల్లో టాప్ క్లాస్ అంటే కుక్కలే.  ఇంతకీ కొన్ని వీధి కుక్కలు ఎందుకు దాడులు చేస్తుంటాయి? టూ వీలర్స్‌పై వెళ్లే వాళ్లను ఎందుకు తరుముతాయి ? కొన్ని కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు ఎందుకు  వస్తాయి ? అనే అంశాలపై పెటా ఇండియా సంస్థ పలువురు నిపుణులతో కలిసి అధ్యయనం నిర్వహించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మనుషుల ప్రవర్తనలో వస్తున్న మార్పులతోనే కుక్కల్లో క్రూరత్వం పెరుగుతోందని తేలింది. కుక్కలకు బయట తిండి దొరకడం లేదు. మనుషుల నుంచి ఆదరణ కరువైంది. కుక్కలు కనిపిస్తే తరిమికొట్టడం లాంటి చర్యలు ఎక్కువయ్యాయి. దీంతో కుక్కలు ఫ్రస్ట్రేషన్​కు గురవుతున్నాయి. కరోనా టైంలో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో వాటి సంతానం బాగా పెరిగిపోయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP districts
  • AP government
  • dog bite
  • dogs
  • Dogs Care Centers

Related News

Good news from the government for those waiting for pensions.

Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతు మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 2.20 లక్షల మందికి వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అర్హులైన మహిళలకు రాబోయే ఒకటి రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున పింఛను అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd