Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ ?
వాస్తవానికి ఈ కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma) దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
- By Pasha Published Date - 11:54 AM, Mon - 25 November 24

Ram Gopal Varma : సినిమా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్‌వర్మ కామెంట్స్‌ను విని చాలామంది చంద్రబాబు, పవన్ ఫ్యాన్స్ బాధపడ్డారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు రాంగోపాల్‌వర్మపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు రాంగోపాల్‌వర్మ డుమ్మా కొట్టారు. దీంతో ఆయన అరెస్టుకు పోలీసులు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాంగోపాల్‌వర్మ నివాసం వద్దకు ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. అయితే ఇంట్లో రాంగోపాల్ వర్మ లేరని తెలిసింది. ఆయనకు పోలీసులు ఫోన్ కాల్ చేయగా.. స్విచ్ఛాఫ్ వస్తోంది.
రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు.నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన రాంగోపాల్ వర్మ.తన లాయర్‌తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చిన #RGV #ramgopalvarma #Ongole #Police #HashtagU pic.twitter.com/08XGnMtzf5
— Hashtag U (@HashtaguIn) November 25, 2024
Also Read :Telangana Airports : తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు.. వచ్చే ఏడాది ‘మామునూరు’ రెడీ
వాస్తవానికి ఈ కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma) దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నో చెప్పింది. దీంతో వెంటనే ఒంగోలు పోలీసులకు రాంగోపాల్‌వర్మ ఒక మెసేజ్ పంపారు. తనకు 4 రోజుల టైం ఇవ్వాలని నవంబరు 19న వారిని కోరారు. ఆ లెక్కన చూసుకున్నా నవంబరు 23లోగా రాంగోపాల్‌వర్మ వెళ్లి పోలీసులను కలవాల్సి ఉంది. ఆయన మాట తప్పారు. దీంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాంగోపాల్ వర్మ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇక ఏపీ పోలీసుల తీరును వర్మ తరపు లాయర్ తప్పు పడుతున్నారు. పోలీసుల విచారణకు గడువు కోరే హక్కు వర్మకు ఉంటుందని ఆయన అంటున్నారు. వర్మపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే న్యాయపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని లాయర్ చెబుతున్నారు.
Also Read :BRS MLAs : త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జంప్ ?
RGV అరెస్టుకు రంగం సిద్ధం హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం పోలీసులు విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ RGV విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. #rgv #arrestwarrant #HashtagU @RGVzoomin pic.twitter.com/65UOADOTeT
— Hashtag U (@HashtaguIn) November 25, 2024