HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Government Plans 320 Metre Long Cable Bridge In Amaravati

Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.

  • Author : Gopi Date : 05-09-2025 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cable Bridge
Cable Bridge

Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృష్ణా నదిపై ఒక ఐకానిక్ కేబుల్ వంతెన (Iconic Cable Bridge) నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ బ్రిడ్జి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతితో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టును కేవలం ఒక వంతెనగా కాకుండా, ఒక కళాత్మక కట్టడంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు గాను ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు ప్రత్యేక డిజైన్లను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచి, వాటిలో ఒకటి ఎంపిక చేసేందుకు ఓటింగ్‌కు అవకాశం కల్పించింది.

ఈ వంతెన డిజైన్లు ఆధునిక ఇంజినీరింగ్‌తో పాటు స్థానిక కూచిపూడి కళను మిళితం చేయడం విశేషం. ఎంపికైన నాలుగు నమూనాల్లో మూడు డిజైన్లు కూచిపూడి నృత్యంలోని వివిధ భంగిమలను ప్రతిబింబిస్తాయి. నాలుగవ డిజైన్, అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ‘A’ ఆకారంలో రూపొందించబడింది. ఈ డిజైన్లన్నీ అమరావతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావాలని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

ప్రభుత్వం ఈ కేబుల్ వంతెన డిజైన్‌ను నిర్ణయించే అవకాశాన్ని ఏపీ ప్రజలకే కల్పించింది. దీని ద్వారా ప్రజలు తమ అభిరుచికి తగ్గ డిజైన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పొందుతారు. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా ఎంపికైన డిజైన్ భవిష్యత్తులో అమరావతికి ఒక గుర్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక కొత్త శోభను తీసుకురావడమే కాకుండా పర్యాటకంగా కూడా అమరావతిని ఆకర్షణీయంగా మార్చనుంది. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ప్రాజెక్టు వివరాలు

ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది. ఇది విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి కొత్త రాజధానిని కలిపే ముఖద్వారంగా ఉపయోగపడుతుంది.ఈ వంతెన నిర్మాణం కోసం దాదాపు రూ. 760 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh government
  • ap news
  • Cable Bridge
  • nda govt

Related News

Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్య రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. నూతన పర్యాటక విధానంలో భాగంగా హోటల్స్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మరో సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించగా.. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ హోటల్‌ను రూ.82.49 కోట్లతో ఒ

  • Perninani Rappa Rappa

    Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?

  • amaravati farmers land allotment

    Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్‌ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!

  • Amaravati

    Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.

Latest News

  • JEE : జేఈఈ ఫలితాల్లో ఆకాశ్ విద్యార్థుల హ్యాట్రిక్ స్కోర్లు

  • Bengal Elections : టూవీలర్స్ పై ఆంక్షలు

  • IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC

  • IPL 2026 : CSK కు బిగ్ షాక్

  • Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd