Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లగా ప్రకటించారు.
- Author : Latha Suma
Date : 09-08-2024 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
Alla Nani: వైసీపీకీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు.. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాశారు. అయితే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని అందుకే .. పార్టీ పదవులకు రాజీనామా చేశారని చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు, కేడర్ నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న కీలక నేతలంటా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఏలూరు అసెంబ్లీ ఇంచార్జీ, అధ్యక్ష పదవులకు ఆయన రాజీనాయ చేశారు. అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటానని వెల్లడించారు.