Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 6 మండలాలు.. అవి ఇవే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Gopichand Published Date - 07:43 AM, Thu - 2 March 23

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరంలను అర్బన్, రూరల్ మండలాలుగా.. మచిలీపట్నంను సౌత్, నార్త్ మండలాలుగా విభజిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని.. నెలలోగా అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: 3 Northeast States : నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఓట్ల లెక్కింపు
ఇప్పుడున్న పరిధులే కొత్త మండలాల్లోనూ కొనసాగుతాయి. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెవెన్యూ పరంగా మరింత సుపరిపాలన అందించడంలో భాగంగా ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా జిల్లా కేంద్రాల్లో పెరుగుతున్న పట్టణీకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.