HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Will Pakistan Mediate Reconciliation Between The Us And Iran

పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆదివారం (మార్చి 23, 2026) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు.

  • Author : Gopi Date : 24-03-2026 - 7:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan
Pakistan

Pakistan: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్న తరుణంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు తుర్కియే, ఈజిప్ట్, పాకిస్థాన్ ప్రతినిధులు వైట్ హౌస్ దూత స్టీవ్ విట్‌కాఫ్‌తో సమావేశమయ్యారని పలు నివేదికలు పేర్కొంటున్న సమయంలో పాకిస్థాన్ నుండి ఈ ప్రకటన రావడం గమనార్హం.

చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైన పాకిస్థాన్

అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మాట్లాడుతూ.. “ఇరాన్, ఇజ్రాయెల్ కోరుకుంటే చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇస్లామాబాద్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటానికి నిరంతర సంభాషణ, దౌత్యంపై మొగ్గు చూపాలి” అని అన్నారు. వచ్చే 5 రోజుల వరకు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయవద్దని ట్రంప్ సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని, దాదాపు 15 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. అయితే టెహ్రాన్ (ఇరాన్) ట్రంప్ వాదనలను తోసిపుచ్చింది.

Also Read: Philips launches ‘OneChef’ : ఒకే పరికరంలో 33 వంటలు చేసుకోవచ్చు..ఎలాగో తెలుసా ?

దౌత్య మార్గాలకు కేంద్రంగా పాకిస్థాన్: నివేదిక

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆదివారం (మార్చి 23, 2026) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారు. ఆ మరుసటి రోజే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. అనంతరం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తన ఇరాన్, తుర్కియే సహచరులతో విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. ఈ వారాంతంలో ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా ఉన్నతాధికారుల మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ ‘ఛానల్ 12’ ఒక సీనియర్ ఇజ్రాయెలీ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.

ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఇరాన్

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల పూర్తి పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్ మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ ఖండించింది. ఇవి కేవలం “ఫేక్ న్యూస్” అని ఇరాన్ కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా ఇరాన్ స్పందిస్తూ “అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికి అలాగే అమెరికా, ఇజ్రాయెల్ చిక్కుకున్న ఊబి నుండి బయటపడటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు” అని పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breaking news
  • Donald Trump
  • Iran
  • pakistan
  • us

Related News

Highly Emotional Atmosphere

Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, భద్రతా, విదేశాంగ విధానాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తేహ్రాన్ వీధుల్లో కనిపిస్తున్న జనసందోహం దేశంలో నెలకొన్న భావోద్వేగ పరిస్థితికి ప్రతిబింబంగా నిలుస్తోంది

  • Trump warns China over Panama Canal: We will not allow it.

    Donald Trump: పనామా కాలువ విషయంలో చైనాను హెచ్చరించిన ట్రంప్: దీనిని మేము అనుమతించము.

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd