Portugal Wildfire: పోర్చుగల్ అడవుల్లో మంటలు, ఏడుగురు మృతి
Portugal Wildfire: పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి, ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో ఇళ్ళు కాలిపోయాయి. పోర్చుగల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. పోర్చుగీస్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
- By Praveen Aluthuru Published Date - 08:48 PM, Wed - 18 September 24
Portugal Wildfire: పోర్చుగల్(Portugal) లోని మధ్య మరియు ఉత్తర ప్రాంతాలలో అడవిలో మంటలు (Wildfire) చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు. దట్టమైన మంటల కారణంగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్ళు కాలిపోయాయి. దీంతో ప్రధాన రహదారులను మూసివేయాల్సి వచ్చింది.
నేషనల్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ ప్రొటెక్షన్ అథారిటీ అవీరో జిల్లాలోని నాలుగు ప్రదేశాలలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారకులైన ముగ్గురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పొంబల్, అల్వెజెర్ మరియు కాండిక్సా-ఎ-నోవా ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు.
విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోర్చుగల్ ప్రభుత్వం గురువారం వరకు దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Asaduddin Owaisi : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయి