Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామాగ్రి?
దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది
- By Praveen Aluthuru Published Date - 07:59 AM, Sat - 13 May 23

Ukraine War: దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధ సామగ్రి సరఫరా అంశం హాట్ హాట్ గా మారింది. అమెరికా చేసిన ఈ ఆరోపణపై దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబారిని పిలిపించి ప్రశ్నించింది. ఈ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మధ్య ఫోన్ సంభాషణ జరపడం మరింత చర్చనీయాంశమైంది.
ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు దక్షిణాఫ్రికా రష్యాకు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తుందని అమెరికా ఆరోపించింది. దక్షిణాఫ్రికా దీనిని ఖండించింది. త్వరలో ఆఫ్రికన్ విదేశాంగ మంత్రి నలేడి పండోర్ ఈ ఆరోపణపై అమెరికన్ కౌంటర్ ఆంటోనీ బ్లింకెన్‌తో మాట్లాడనున్నారు.
దక్షిణాఫ్రికాలోని యుఎస్ రాయబారి రూబెన్ బ్రిగెట్టి మాట్లాడుతూ.. డిసెంబర్ 2022 లో దక్షిణాఫ్రికా తన సైమన్ టౌన్ నావికా స్థావరం నుండి రష్యా ఓడలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని లోడ్ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత దక్షిణాఫ్రికా రష్యాకు ఈ సరఫరా చేసిందన్నారు. దక్షిణాఫ్రికా చేస్తున్న ఈ పనిని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది.
Read More: Hyderabad : మహిళలపై వేధింపులకు పాల్పడిన ఐదుగురికి జైలుశిక్ష