Hyderabad : మహిళలపై వేధింపులకు పాల్పడిన ఐదుగురికి జైలుశిక్ష
హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో స్థానిక కోర్టు ఐదుగురికి జైలుశిక్ష విధించింది. హైదరాబాద్‌లోని షీ
- By Prasad Published Date - 07:37 AM, Sat - 13 May 23

హైదరాబాద్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో స్థానిక కోర్టు ఐదుగురికి జైలుశిక్ష విధించింది. హైదరాబాద్‌లోని షీ టీమ్స్‌కు పట్టుబడిన ఐదుగురు వ్యక్తులకు ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. ఓ కేసులో పంజాగుట్టకు చెందిన వాచ్‌మెన్ వి.రామచంద్రుడు తాను పనిచేస్తున్న అపార్ట్‌మెంట్‌లోని ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడినందుకు అతనికి ఎనిమిది రోజుల జైలు శిక్ష పడింది. మరో కేసులో ప్రేమ పేరుతో మహిళను మోసం చేసి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఎల్‌బీ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎం.ఆంజనేయులుకు ఐదు రోజుల జైలు శిక్ష పడింది. మూడో కేసులో బంజారాహిల్స్‌కు చెందిన కారు డ్రైవర్ వి.రాజ్‌కిరణ్ (32) తన ఇంటి యజమానిని వేధించి బెదిరించినందుకు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. అదేవిధంగా మరో కేసులో మహిళను దుర్భాషలాడిన కేసులో కారు డ్రైవర్ మహ్మద్ షాబాజుద్దీన్ (23)కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించింది. ఐదో కేసులో మాదాపూర్‌కు చెందిన కె.మురళి (32) తన ఇరుగుపొరుగు మహిళతో న్యూడ్ వీడియో కాల్స్ చేసి దుర్భాషలాడిన కేసులో ఎనిమిది రోజుల జైలు శిక్ష పడింది.