HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Urges Israel To Probe Video Of Prison Sex Abuse

Israel : ఇజ్రాయెల్ జైలులో పాలస్తీనా ఖైదీపై లైంగిక వేధింపులు.. అమెరికా కీలక ప్రకటన

ఇజ్రాయెల్‌ జైళ్లలో వేలాది మంది పాలస్తీనా ఖైదీలు చాలా ఏళ్లుగా మగ్గుతున్నారు.

  • Author : Pasha Date : 08-08-2024 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us Urges Israel To Probe Prison Abuse

Israel : ఇజ్రాయెల్‌ జైళ్లలో వేలాది మంది పాలస్తీనా ఖైదీలు చాలా ఏళ్లుగా మగ్గుతున్నారు. పాలస్తీనాలో నిరసన తెలిపారనే నెపంతో ఎంతోమంది సామాన్య పౌరులను తీసుకొచ్చి తమ దేశ జైళ్లలో ఇజ్రాయెల్ నిర్బంధిస్తోంది. వారి జైళ్లలో తీవ్రంగా వేధిస్తోంది. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఈక్రమంలోనే తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌లోని తైమన్ మిలిటరీ బేస్ వద్దనున్న జైలులో ఓ పాలస్తీనా ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై తొమ్మిది మంది ఇజ్రాయెలీ సైనికులను ఇటీవల అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.  అంతర్జాతీయ మీడియాలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా స్పందించింది. పాలస్తీనా ఖైదీని సైనికులు లైంగికంగా వేధిస్తున్న వీడియో బయటపడినందున దానిపై జవాబుదారీగా విచారణ చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఛానల్ 12లోనే ఈ వీడియోను ప్రసారం చేయడం గమనార్హం.  ఓ ఇజ్రాయెలీ సైనికుడు తన చేయిని ప్రైవేటు పార్టు ఉండే భాగం వైపుగా పెట్టుకున్నట్లు ఆ వీడియోలో కనిపించడం కలకలం రేపింది. అందుకే ఒత్తిడికిలోనైన ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం తొమ్మిది మంది సైనికులకు సమన్లు ఇచ్చి, వారిని ఇంటరాగేట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘పాలస్తీనా ఖైదీలపై లైంగిక వేధింపుల వీడియోను మేం చూశాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులకు వెల్లడించారు. ‘‘ఖైదీల మానవ హక్కులు అన్ని సందర్భాల్లోనూ గౌరవించబడాలి. ఉల్లంఘనలు జరిగాయి కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని ఆయన ఇజ్రాయెల్‌కు సూచించారు. సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేసి, దోషులను శిక్షించాలని మాథ్యూ మిల్లర్ కోరారు. మరోవైపు అతివాద ఇజ్రాయెలీ గ్రూపులు మాత్రం తమ దేశ సైనికుల దుశ్చర్యను సమర్ధించుకుంటున్నాయి. హమాస్ మిలిటెంట్లతో అలా ప్రవర్తించడంలో తప్పేం లేదని వాదిస్తుండటం గమనార్హం. మరోవైపు గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ సరిహద్దు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో బాంబుదాడులు చేస్తోంది.

Also Read :Vinesh Phogat Retirement : వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌ నుంచి రిటైర్‌మెంట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Israel.
  • Palestinian Prisoner
  • Prison Abuse
  • us

Related News

Winter Storm Us

అమెరికా లో మంచు తుఫాను బీభత్సం

దేశంలోని దాదాపు సగం జనాభా ఈ శీతల గాలుల ప్రభావానికి గురవుతోందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా దృశ్యమానత (Visibility) పూర్తిగా తగ్గిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

  • America withdrew from the World Health Organization..why..?

    ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..ఎందుకంటే..?

Latest News

  • భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!

  • ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

  • సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అందించబోతున్న బడ్జెట్

  • ఢమాల్ !! ఒక్క రోజే రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

  • తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

Trending News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd