Biden : ఒడిశా రైలు విషాదంపై జో బైడెన్ దిగ్భ్రాంతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden).. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆ భీతావహ యాక్సిడెంట్ గురించి తెలిసి నా గుండె పగిలింది" అని ఆయన తెలిపారు.
- Author : Pasha
Date : 04-06-2023 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden).. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆ భీతావహ యాక్సిడెంట్ గురించి తెలిసి నా గుండె పగిలింది” అని ఆయన తెలిపారు. ” వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోర ప్రమాదం గురించి తెలిసి..నాతో పాటు జిల్ బైడెన్ కూడా చాలా బాధపడ్డారు” అని పేర్కొన్నారు. ” ఈ ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారు, గాయపడిన వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని చెప్పారు. అమెరికా, భారత్ మధ్య సాంస్కృతిక, కుటుంబ బంధాలు బలంగా పెనవేసుకుపోయాయని.. ఒడిశా ప్రమాదంపై అమెరికా ప్రజలందరూ సంతాపం తెలుపుతున్నారని బైడెన్(Biden) తెలిపారు. ఈమేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also read : Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ , బెంగుళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 1,100 మంది గాయపడ్డారు.