US President Earn : అమెరికా అధ్యక్షుడి ఏడాది వేతనం ఎంతో తెలుసా..?
US President Earn : అమెరికా అధ్యక్షుడి జీతం ఎంత ఉంటుంది..? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..? తదితర విషయాల గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు
- By Sudheer Published Date - 03:35 PM, Wed - 6 November 24

అమెరికా అధ్యక్ష (US President Elections) ఎన్నికలు హోరాహారిగా సాగిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి (Republican presidential candidate) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) , డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరా జరుగగా..విజయం మాత్రం ట్రంప్ నే వరించింది. మ్యాజిక్ ఫిగర్ 270 దాటి విజయం అందుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ విజయం తో ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు , బిజినెస్ ప్రముఖులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా అమెరికా అధ్యక్షుడి జీతం ఎంత ఉంటుంది..? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..? తదితర విషయాల గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 400,000 డాలర్లుగా ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.3.36 కోట్లుగా ఉంటుంది. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో 50,000 డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) అందిస్తారు. అలాగే అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లో నివాసం, ఎయిర్ ఫోర్స్ వన్, మెరైన్ వన్ వంటి అధికారిక ప్రయాణ వాహనాలు మరియు అధిక భద్రత కలిగిన నివాసం వంటి ఇతర సౌకర్యాలు కూడా అందిస్తారు. ప్రయాణాల కోసం ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, మరియు భద్రతా సిబ్బంది సహా అనేక సౌకర్యాలు ఉంటాయి. వీటి ఖర్చులు మొత్తం కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది.
Read Also : Pawan Kalyan : పిఠాపురంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్