Ukraine Embassies: ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు నెత్తుటి ప్యాకేజీలు
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాల గత వారం రోజులుగా జంతువులు కళ్లు, రక్తంతో కూడిన ప్యాకేజీలను రష్యా పంపుతుంది.
- By Gopichand Published Date - 06:55 AM, Sun - 4 December 22
వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాల గత వారం రోజులుగా జంతువులు కళ్లు, రక్తంతో కూడిన ప్యాకేజీలను రష్యా పంపుతుంది. జంతువుల కళ్లతో, రక్తంతో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను రష్యా.. అనేక యూరోపియన్ నగరాల్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లకు పంపుతున్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
6 యూరోపియన్ దేశాలలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు ఇటీవల జంతువుల కళ్లతో కూడిన ప్యాకేజీలను అందుకున్నాయని ఉక్రెయిన్ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం మాడ్రిడ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీకి శుక్రవారం జంతు కళ్లతో కూడిన పార్శిల్ వచ్చిందని ఆయన చెప్పారు. హంగేరి, నెదర్లాండ్స్, పోలాండ్, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన ప్యాకేజీలను రష్యా పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
ది గార్డియన్ కథనం ప్రకారం.. పార్శిల్ వచ్చిన వెంటనే పోలీసులు ఎంబసీ ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. స్నిఫర్ డాగ్‌లతో ఆ ప్రాంతాన్ని శోధించారు. లెటర్ బాంబులు, ఆవులు, పందుల కళ్లు వంటి జంతు భాగాలతో కూడిన ప్యాకేజీలను స్వీకరించిన ఎంబసీలకు సంబంధించి ఇప్పటివరకు 17 కేసులు వచ్చాయని సమాచారం. రష్యా ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు.
ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. రష్యా రాయబార కార్యాలయాలు మాత్రం ఆ ఆరోపణలను ఖండించాయి.
Related News
Iranian Election Process: ఇరాన్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా..?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది.