HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trump Signals Potential Us Iran Talks Within 72 Hours

ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

  • Author : Gopi Date : 23-04-2026 - 10:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US-Iran Peace Talks
US-Iran Peace Talks

US-Iran Talks: మధ్యప్రాచ్యంలో యుద్ధ భయం నెలకొన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే 36 నుండి 72 గంటల్లో అంటే శుక్రవారం నాటికి అమెరికా- ఇరాన్ మధ్య కొత్త రౌండ్ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరగనున్న ఈ భేటీపై దౌత్య వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే టెహ్రాన్ (ఇరాన్) వైఖరి ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఇటీవలి చర్చల ద్వారా సానుకూల సంకేతాలు అందాయని, దీనివల్ల తదుపరి 36 నుండి 72 గంటల్లో చర్చలు పునఃప్రారంభం కావచ్చునని ‘న్యూయార్క్ పోస్ట్’ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ చారిత్రాత్మక చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతాయా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్.. అది సాధ్యమే అని సమాధానమిచ్చారు.

Also Read: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు

అధ్యక్షుడు ట్రంప్ బుధవారం మరోసారి తనదైన శైలిలో కాల్పుల విరమణను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన పక్షాన్ని వినిపించడానికి, ఒక బలమైన ప్రతిపాదనను తీసుకురావడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. కాల్పుల విరమణను పొడిగించాలని నేను నా సైన్యాన్ని ఆదేశించాను. కానీ సముద్ర మార్గంలో ఇరాన్ నౌక‌ల‌పై దిగ్బంధం కొనసాగుతుంది. మా సైన్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని రాశారు.

ఇరాన్ ‘వేచి చూసే’ ధోరణి

ట్రంప్ గుడ్ న్యూస్‌ కోసం ఆశిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించడంలేదు. ఈ చర్చల్లో పాల్గొనాలనే విషయంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. గత చర్చల్లో వాషింగ్టన్ (అమెరికా) సీరియస్‌గా వ్యవహరించలేదని, నమ్మకాన్ని వమ్ము చేసిందని ఇరాన్ ఆరోపిస్తుంది. మేము గతంలో చిత్తశుద్ధితో మాట్లాడాము. కానీ అమెరికా నిర్లక్ష్యం చూపింది. ఈ వారాంతంలో జరిగే చర్చల్లో మేము కూర్చుంటామా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు అని బఘాయ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

టెహ్రాన్‌లో అంతర్గత విభేదాలు?

టెహ్రాన్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడానికి అక్కడ ఉన్న వివిధ అధికార కేంద్రాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నాయకత్వంలో అనేక వర్గాలు ఉండటంతో అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరడం కష్టతరంగా మారుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ceasefire Extension
  • Donald Trump
  • Islamabad Summit
  • Middle East crisis
  • pakistan
  • US Iran Talks
  • US-Iran Peace Talks

Related News

Countdown to a major war? Iran warns of 'Zero Hour'… US prepares to send fighter jets to Israel.

Donald Trump: పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌కు యుద్ధ విమానాలను పంపేందుకు అమెరికా సన్నద్ధం

పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక, ఇజ్రాయెల్‌కు విమానాల మోహరింపునకు అమెరికా సన్నద్ధం ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, అణు సంబంధిత కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఒక విస్తృత సైనిక చర్యను యోచిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదిత మోహరింపు జరిగింది. ఇరాన్‌పై సైనిక చర్యలను గణనీయంగా విస్తరించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్

    Latest News

    • Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

    • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

    • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

    • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

    • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd