H1B Visa : H1Bలపై ట్రంప్ షాక్.. ఉద్యోగాలు ఇక కష్టమే!
H1B Visa : అమెరికాలో అవకాశాలు తగ్గిపోవడంతో అనేక ప్రతిభావంతులు దేశంలోనే అవకాశాలను వెతకవలసి వస్తుంది. దీంతో భారతీయ ఐటీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింతగా విస్తరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
- By Sudheer Published Date - 07:30 AM, Sat - 20 September 25

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన H1B వీసాల ఫీజుల పెంపు భారత్ సహా అనేక దేశాల ఐటీ నిపుణులపై భారీ ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు ఐటీ సంస్థలు సగటున కొన్ని వేల డాలర్ల వ్యయంతో ఉద్యోగులను స్పాన్సర్ చేసేవి. కానీ ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఒక ఉద్యోగి వీసాకు లక్ష డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. దీని వల్ల అమెరికాలోని మధ్య తరహా కంపెనీలు, స్టార్టప్ సంస్థలు ఎక్కువగా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే ఈ స్థాయి ఖర్చును భరించే సామర్థ్యం పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Suryakumar Yadav : వైరల్ గా మారిన సూర్యకుమార్ సమాధానం..అసలు ఏంజరిగిందంటే !!
ఇక భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం మరింత ప్రతికూల ప్రభావం చూపనుంది. MS లేదా ఇతర హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అంచనా. చదువులు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయని భావించి చాలా మంది విద్యార్థులు ముందుగానే ప్లాన్ మార్చుకోవచ్చు. ఇప్పటికే చదువులు పూర్తిచేసినవారు కూడా వీసా స్పాన్సర్ పొందాలంటే కంపెనీకి కనీసం లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలగాలి. ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చు.
AP Assembly : అసెంబ్లీ సమావేశాలు వాయిదా
ఈ పరిణామాలు భారత్‌లోనూ ప్రభావం చూపే అవకాశముంది. అమెరికాలో అవకాశాలు తగ్గిపోవడంతో అనేక ప్రతిభావంతులు దేశంలోనే అవకాశాలను వెతకవలసి వస్తుంది. దీంతో భారతీయ ఐటీ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింతగా విస్తరించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాత్కాలికంగా ఇది విద్యార్థులు, యువ ఐటీ ప్రొఫెషనల్స్‌కు పెద్ద సవాలుగా మారబోతోంది. అమెరికా డ్రీమ్ కోసం పోరాడుతున్న మధ్య తరగతి కుటుంబాల ఆశలు కూడా కొంత మేర నీరుగారతాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది దేశీయ పరిశ్రమలకు లాభదాయకంగా మారే అవకాశముంది.