Suryakumar Yadav : వైరల్ గా మారిన సూర్యకుమార్ సమాధానం..అసలు ఏంజరిగిందంటే !!
Suryakumar Yadav : 2024 జనవరిలో అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో, అలాగే అదే ఏడాది జూన్‌లో ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఆటగాళ్ల పేర్లు మరిచిపోయిన సంఘటనలు గుర్తొచ్చాయి. అప్పట్లో వ్యాఖ్యాతలు, సహచరులు ఆయనకు గుర్తు చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- By Sudheer Published Date - 08:23 PM, Fri - 19 September 25
 
                        ఆసియా కప్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, ఒమాన్ జట్లు తలపడగా, టాస్ సమయంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) జట్టులో జరిగిన మార్పులను వివరిస్తుండగా, ఒక్క ఆటగాడి పేరు మరిచిపోయారు. రవి శాస్త్రి “జట్టులో ఎవరు కొత్తగా వచ్చారు?” అని అడగగానే, సూర్య “హర్షిత్ రాణా(Harshit Rana) ఉన్నాడు, ఇంకో ప్లేయర్…” అని ఆగి నవ్వుతూ, “అయ్యో, నేనూ రోహిత్ శర్మలా ప్రవర్తిస్తున్నాను” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిన్న తప్పిదం క్షణాల్లోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
AP Assembly : అసెంబ్లీ సమావేశాలు వాయిదా
ప్లేయింగ్ ఎలెవన్ ప్రకారం, జట్టు మేనేజ్‌మెంట్ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వగా, వారి స్థానంలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లను తీసుకున్నారు. అయితే సూర్యకుమార్ కాసేపు పేరు మర్చిపోయి తడబడిన క్షణం, అభిమానులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే ఇలాంటివి గతంలో రోహిత్ శర్మకు పలు సార్లు జరిగాయి. 2024 జనవరిలో అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో, అలాగే అదే ఏడాది జూన్‌లో ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఆటగాళ్ల పేర్లు మరిచిపోయిన సంఘటనలు గుర్తొచ్చాయి. అప్పట్లో వ్యాఖ్యాతలు, సహచరులు ఆయనకు గుర్తు చేసిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సంఘటనపై అభిమానులు విస్తృతంగా స్పందిస్తున్నారు. “ఇది నిజంగా రోహిత్ మూమెంట్ లాంటిదే”, “రోహిత్ వారసత్వాన్ని సూర్య కొనసాగిస్తున్నాడు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ భార్య, సహచర ఆటగాళ్లు కూడా ఆయన అలవాటును సరదాగా అంగీకరించగా, ఇప్పుడు సూర్యకుమార్ కూడా అదే తరహా పరిస్థితిని ఎదుర్కోవడం అభిమానులకు మరింత వినోదంగా అనిపించింది. టాస్ సమయంలో జరిగిన ఈ చిన్న తప్పిదం, మ్యాచ్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Playing XI for #INDvOMA 👌
2️⃣ changes by #TeamIndia 🔄
Updates ▶️ https://t.co/XAsd5MHdx4
#AsiaCup2025 pic.twitter.com/DGiXPkEirU
— BCCI (@BCCI) September 19, 2025
 
                    



